(Source: ECI/ABP News/ABP Majha)
జర్నలిస్ట్‌లను ఉద్యోగులుగా పరిగణించలేం, వాళ్లకి ఆ చట్టాలు వర్తించవు - బాంబే హైకోర్టు
Bombay HC: వర్కింగ్ జర్నలిస్ట్‌లని ఉద్యోగులుగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
Bombay High Court: బాంబే హైకోర్టు జర్నలిస్ట్‌లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. వర్కింగ్ జర్నలిస్ట్‌లు Maharashtra Recognition of Trade Unions, Prevention of Unfair Labour Practices Act పరిధిలోకి రారని తేల్చి చెప్పింది. వాళ్లకు సొసైటీలో స్పెషల్ స్టేటస్ లభిస్తోందని, వాళ్లని ఈ చట్టాల పరిధిలోకి తీసుకురావడం కుదరదని స్పష్టం చేసింది. అంతకు ముందు ఇండస్ట్రియల్ కోర్ట్‌లో ఓ జర్నలిస్ట్ వేసిన పిటిషన్‌లూ చెల్లవని వెల్లడించింది. జస్టిస్ నితిన్ జందర్, జస్టిస్ సందీప్ మర్నేతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 29వ తేదీన ఈ విషయం స్పష్టం చేసింది. Working Journalists Act చట్టం కింద జర్నలిస్ట్‌లకు స్పెషల్ స్టేటస్ ఉందని, Industrial Disputes Act కింద వాళ్ల సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశమూ ఉందని బాంబే హైకోర్టు తెలిపింది. 2019లోనే ఇద్దరు జర్నలిస్ట్‌లు తమని Prevention of Unfair Labour Practices Act పరిధిలోకి చేర్చకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ కోర్ట్‌లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం...Working Journalists Act 1955 ని పరిశీలించింది. తమతమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు జర్నలిస్ట్‌లకు ఇప్పటికే ఈ చట్టం సహకరిస్తోందని వివరించింది.
"సాధారణ ప్రజలకి, జర్నలిస్ట్‌లకి ఏ మాత్రం తేడా లేనప్పుడు జర్నలిస్ట్‌లు ప్రత్యేక చట్టం కింద స్పెషల్ స్టేటస్ పొందడంలో అర్థం లేదు. వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ కింద జర్నలిస్ట్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వాళ్లు తమ వివాదాల్ని, సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే Industrial Disputes Act ని వినియోగించుకోవచ్చు"
- బాంబే హైకోర్టు