Wipro Layoffs: ఈ సారి విప్రో వంతు, ఒకేసారి 120 మందిని తొలగించిన కంపెనీ
Wipro Layoffs: విప్రోలోనూ లేఆఫ్‌లు మొదలయ్యాయి.
Wipro Layoffs:
లేఆఫ్‌లు ఎక్కడంటే..?
ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో విప్రో (Wipro Layoffs) కూడా చేరిపోయింది. ఒకేసారి 120 మందిని తొలగించింది. అయితే...ఈ లేఆఫ్‌లు జరిగింది ఇండియాలో కాదు. అమెరికాలోని ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ రిక్వైర్‌మెంట్స్‌కు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. వీరిలో 100 మందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్స్ ఉన్నారని చెప్పిన విప్రో...వీరితో పాటు టీమ్ లీడర్‌లు, టీమ్ మేనేజర్‌లు కూడా ఉన్నారని వెల్లడించింది Tampa ప్రాంతంలోని క్యాంపస్‌లోని ఉద్యోగులను తొలగించినట్టు వివరించింది. అయితే...ఇతర ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. మరోసారి ఉద్యోగాల కోత విధించే అవకాశాలు లేనట్టే అన్న సంకేతాలిచ్చింది. అయితే మే నెలలో విప్రోలో లేఆఫ్‌లు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో విప్రో ఈ వార్తల్ని ధ్రువీకరించింది కూడా. అయితే..తంప రీజియన్‌లోని ఆఫీస్‌లో మాత్రం ఈ కోతలు ఉండవని తెలిపింది. ఇక్కడి ఉద్యోగులు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నా మిగతా చోట్ల మాత్రం ఎంప్లాయిల్ తెగ కంగారు పడిపోతున్నారు. ఎప్పుడు "Fired" అంటూ మెయిల్స్ వస్తాయో అని భయ పడుతున్నారు. ఇటీవలే విప్రో ఓ సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. ఫ్రెషర్స్ జీతాల్లో సగం కోత విధించింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పుడు అందులో కోట్ చేసిన సీటీసీలో సగమే ఇస్తామని చెప్పింది. ఇందుకు ఒప్పుకుంటేనే ఉద్యోగంలో చేరాలని చెప్పింది.
మెటా, గూగుల్, ఓయో....
మెటాలో మరోసారి 10 వేల మందిని తొలగించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. గూగుల్‌లోనూ విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు టెక్ సెక్టార్‌లో బాగా వినిపిస్తున్న పదం "లే ఆఫ్‌లు". దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ కోతలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఇప్పటికే ట్విటర్, అమెజాన్, ఫేస్‌బుక్ ఈ పని మొదలు పెట్టాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటి బాట పడుతున్నారు. ఇప్పుడీ జాబితాలో ఓయో (OYO) కంపెనీ కూడా చేరిపోయింది. ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. కొన్ని ప్రాజెక్ట్‌లను నిలిపివేసి, అన్ని టీమ్‌లను మెర్జ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో..సేల్స్ టీమ్ కోసం కొత్తగా 250 మందిని రిక్రూట్ చేసుకుంటన్నట్టు వెల్లడించింది. రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొత్త వాళ్లను కంపెనీలోకి తీసుకోనున్నట్టు పేర్కొంది. వచ్చే నెలలోగా ఈ రిక్రూట్‌మెంట్ పూర్తవనుంది. హోటల్స్ సంఖ్య పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసేందుకూ ప్రత్యేకంగా కొందరి ఉద్యోగులను నియమించుకోనుంది ఓయో.
ఈ లేఆఫ్‌లపై కంపెనీ సీఈవో రితేష్ అగర్వాల్ స్పందించారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ వేరే కంపెనీల్లో జాబ్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వారికి ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. "ఈ ఉద్యోగుల నైపుణ్యాలేంటో, సామర్థ్యాలంటే మా కంపెనీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. కంపెనీ అభివృద్ధి కోసం పని చేసిన వీళ్లను ఉద్యోగం నుంచి తొలగించాల్సి రావడం దురదృష్టకరం. వీళ్లందించిన సేవలు ఎంతో విలువైనవి. మా కంపెనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. ఆ స్థాయిలో అవసరమైన ఉద్యోగులను వెతుక్కోవాల్సి వస్తోంది. అందుకే...ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. కొత్త వారికి అవకాశాలివ్వాలని అనుకుంటున్నాం" అని వెల్లడించారు.