అన్వేషించండి

Job guarantee scheme politics: ఉపాధి హామీలో మార్పులు - బీజేపీ గ్రామీణ ఓటు బ్యాంక్‌ను రిస్క్‌లో పెట్టుకుంటోందా ?

BJP: ఉపాది హామీ పథకంలో మార్పులతో బీజేపీ రాజకీయంగా నష్టాన్ని ఎదుర్కోనుందనన్న అభిప్రాయం వినిపిస్తోంది.రాష్ట్రాలపై భారం పెంచడం వల్ల పథకం నిర్వీర్యం అయ్యే సూచనలతో పాటు పేరు మార్పు కూడా వివాదాస్పదమవుతోంది.

Will BJP face political losses with changes in the job guarantee scheme :  గ్రామీణ  ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  చుట్టూ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకంలో తీసుకొస్తున్న మార్పులు, సాంకేతిక ఆంక్షలు,  నిధుల కేటాయింపులపై గ్రామీణుల్లో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది.  

గ్రామీణ గుండెకాయ.. ఉపాధి హామీ

భారతదేశంలోని కోట్ల మంది కూలీలకు ఉపాధి హామీ పథకం కేవలం ఒక పని మాత్రమే కాదు, అది వారి ఆర్థిక భద్రత. ముఖ్యంగా వ్యవసాయం లేని రోజుల్లో ఈ పథకం గ్రామీణ పేదల ఆకలి తీరుస్తోంది. రాజకీయంగా చూస్తే, ఈ పథకం ఏ పార్టీకైనా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకును అందిస్తుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ పథకం ద్వారానే రెండోసారి అధికారంలోకి వచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు దీనిని కదిలించడం అంటే, నేరుగా గ్రామీణ ఓటర్ల పొట్ట కొట్టడమేనన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

కొత్త నిబంధనలతో ఆందోళన

బీజేపీ ప్రభుత్వం పారదర్శకత పేరుతో ప్రవేశపెట్టిన కొన్ని మార్పులు క్షేత్రస్థాయిలో ప్రతికూలతను తెచ్చిపెడుతున్నాయి. మొబైల్ యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసి అటెండెన్స్ వేయాలన్న నిబంధన నెట్‌వర్క్ లేని మారుమూల గ్రామాల్లో పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల పనులు చేసినా కూలీ పడటం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానంలో సాంకేతిక లోపాల వల్ల వేలాది మంది కూలీలు తమ వేతనాలను కోల్పోతున్నారు. ఈ పథకానికి నిధులు తగ్గించడం, రాష్ట్రాలు నలభైశాతం భరించాలనే రూల్ తో .. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాయన్న భావనపెరుగుతోంది. 

బీజేపీ రాజకీయ వ్యూహం - రిస్క్ ఉందా?

బీజేపీ ఈ పథకాన్ని ఆస్తుల సృష్టి  వైపు మళ్ళించాలని చూస్తోంది. అంటే కేవలం గుంతలు తీయడం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన చెరువులు, కాలువలు వంటివి నిర్మించాలని భావిస్తోంది. అయితే, ఈ క్రమంలో యంత్రాల వాడకం పెరగడం వల్ల కూలీలకు పని తగ్గుతోంది. గ్రామీణ ఓటర్లు ఈ మార్పులను తమకు వ్యతిరేకంగా భావిస్తే, రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి ఉపాధి హామీలో అసంతృప్తి కూడా ఒక కారణమని భావిస్తున్నారు.

 పేర్లు మార్పు - సిద్ధాంతపరమైన పోరు

ఈ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ  పేరును తొలగించారు. వీబీజీ రామ్ జీ  అనే పేరు పెట్టారు.  విపక్షాలు దీనిని కాంగ్రెస్ మార్క్  పథకం కావడంతోనే బీజేపీ ఇలా చేస్తోందని ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ పథకం స్వరూపం పూర్తిగా మారిపోతే, గ్రామీణ పేదలు దీనిని తమ హక్కుగా కాకుండా ప్రభుత్వ దయగా భావించే ప్రమాదం ఉంది. ఇది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

 విశ్లేషణ: లాభమా? నష్టమా?

టెక్నాలజీ పేరుతో అవినీతిని అరికట్టడం మంచిదే అయినప్పటికీ, అది సామాన్య కూలీకి భారంగా మారకూడదు. కేంద్రం తీసుకొస్తున్న మార్పులు  పరిపాలనా సంస్కరణలు అని బీజేపీ అంటున్నప్పటికీ, ప్రజల్లోకి అది  పథకం కోత గా వెళ్తే మాత్రం బీజేపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలక తప్పదు. ముఖ్యంగా గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తున్నారు. మరి బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా? 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget