Viral News: ఊరంతా బెట్టింగ్ బంగార్రాజులే -అన్ని ఇళ్లకూ ఫర్ సేల్ బోర్డులే - వీరి కథ వింటే జాలి పడతారు !
Rajasthan: రాజస్తాన్‌లోని ఓ పట్టణ ప్రజలు అందరూ ఇళ్లకు ఫర్ సేల్ బోర్డులు పెట్టారు. వారి బాధలు తెలుసుకుంటే జాలిపడకుండా ఉండలేం.

Rajasthan Town: రాజస్థాన్‌లో ఫలోడి అనే పట్టణంలోని ప్రతి ఇంటికి ఫర్ సేల్ బోర్డులు పెట్టేశారు యజమానాలు. కొనేవాళ్లుంటే అమ్ముకుని ఎక్కడికైనా పోదామని అందరూ అనుకుంటున్నారు. For Sale బోర్డులు ఇళ్లు, దుకాణాలు, మరియు భూములపై కనిపిస్తున్నాయి.
ఫలోడి పట్టణం ఎడారి ప్రాంతంలో ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో, అస్థిరమైన వాతావరణ పరిస్థితులు, నీటి కొరత, ఆదాయాలు పడిపోవడం వంటి వాటి వల్ల స్థానికులు తమ ఆస్తులను విక్రయించి, జైపూర్, జోధ్‌పూర్, గుజరాత్ వంటి చోట్లకు వలస వెళ్లిపోతున్నారు. పైగా ఫలోడి సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. డ్రోన్ దాడులు , భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు స్థానికులలో భద్రతా ఆందోళనలను పెంచాయి. ఈ భయం కూడా వారిని ఆస్తుల అమ్మకానికి ప్రోత్సహిస్తోంది.
అవి మాత్రమే సమస్యలు కాదు.. ఫలోడికి పెద్ద సమస్యగా బెట్టింగ్ ఉంది. ఫలోడి రాజస్థాన్‌లో ఒక ప్రసిద్ధ బెట్టింగ్ కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఎన్నికలు, క్రికెట్ మ్యాచ్‌లు నుంచి వర్షం పడుతుందా లేదా అన్న దాని వరకూ సట్టా బెట్టింగ్ జరుగుతుంది. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో, ఫలోడి సట్టా మార్కెట్ BJP 115-118 సీట్లు, కాంగ్రెస్ 68-70 సీట్లు గెలుస్తుందని ఖచ్చితంగా అంచనా వేసింది. ఈ బెట్టింగ్ సంస్కృతి కొందరు స్థానికులను ఆర్థిక నష్టాల్లోకి నెట్టింది. బెట్టింగ్‌లో ఓడిపోయినవారు తమ ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది “అమ్మకానికి” బోర్డుల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా మారింది.
#phalodi #phalodicity #PHALODI
— dinesh x geo (@dineshmandhniya) March 27, 2025
Apart from the campaigns and speeches, a small city from Rajasthan has taken centre stage during this election. Situated near Jodhpur, Phalodi is a small city based on the number of people who live there. But, the city is known for its popular satta… pic.twitter.com/9c6S6VMK6a
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ నుండి 413 డ్రోన్ దాడులు జరిగాయి. బార్మర్, జైసల్మేర్, బికానెర్, శ్రీగంగానగర్ జిల్లాలపై జరిగాయి, అయితే భారత రక్షణ వ్యవస్థలు వీటిని మధ్య గాలిలోనే నాశనం చేశాయి. మే 10-11, 2025న బార్మర్ , జైసల్మేర్‌లో డ్రోన్ దాడుల కారణంగా బ్లాక్‌ఔట్ విధించారు. ఫలోడి, జోధ్‌పూర్ జిల్లాలో ఉంది, ఇది సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఈ ఉద్రిక్తతలు స్థానికులలో భయాందోళనలను సృష్టించాయి. అందుకే ఈ సిటీలో ఉండకూడదని దాదాపుగా అందరూ డిసైడయ్యారు. అమ్ముకోలిగిన వాళ్లు అమ్ముకుని వెళ్లిపోతున్నారు. కొంత మంది వదిలి పెట్టి వెళ్లిపోతున్నారు.
అయితే ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించకపోవడతో చాలా కొన్ని గ్రామాల వాసులు..తమ ఇళ్లకు ఫర్ సేల్ బోర్డులు పెట్టి నిరనన చెబుతూ ఉంటారు. వీరు కూడా అాలగే చేస్తున్నారని కొంత మంది భావిస్తున్నారు. పుట్టిన ఊరును వదిలేసి పోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరని అంటున్నారు.





















