Rahul Gandhi: అమెరికాకు మోదీ సరెండర్ - భారత ఆత్మగౌరవానికిదెబ్బ - మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు
Rahul On Modi: ఆపరేషన్ సిందూర్ విషయంలో మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు పెంచుతున్నారు. తాజాగా భోపాల్ లో మోదీ అమెరికాకు లొంగిపోయారని ఆరోపించారు.

Narendra Surrender: ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ పాకిస్తాన్ కు సరెండర్ అయ్యారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారంమధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో మోదీ “సరెండర్” అయ్యారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు లొంగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారిక ఖాతా ద్వారా “నరేందర్... సరెండర్ ” అంటూ ట్వీట్ చేశారు.
భారత్ , పాకిస్తాన్ DGMO స్థాయిలో చర్చల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందానికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని పేర్కొన్నారు, అయితే భారత విదేశాంగ శాఖ ఈ వాదనను ఖండించింది, కాల్పుల విరమణ పాకిస్తాన్ DGMO యొక్క అభ్యర్థన మేరకు జరిగిందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ గాంధీ ట్రంప్ ఫోన్ చేసి అడిగిన వెంటనే మోదీ కాల్పుల విరమణకు అంగీకరించారని, ఇది భారత ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆరోపించారు.
नरेंदर... सरेंडर 😉 pic.twitter.com/UkLxMxZlVf
— Congress (@INCIndia) June 3, 2025
రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ విషయంోల మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం మద్దతు ఇచ్చినప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందం భారత ప్రయోజాలను పణంగా పెట్టిందని ఆరోపించారు. మోదీ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయారని ఆరోపించారు. ఆయన మోదీని “ఖోఖ్లే భాషణ్‌లు” ఆపమని ఎద్దేవాచేశారు.
#WATCH | Bhopal, Madhya Pradesh | Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Now, I understand RSS-BJP well. If slight pressure is put on them, they run away out of fear. When Trump called Modi ji-'Modi ji kya kar rahe ho, Narender-Surrender and with 'ji hazooor', Narender… pic.twitter.com/XIjOm8CSid
— ANI (@ANI) June 3, 2025
ఆపరేషన్ సిందూర్‌ను భారత సైన్యం యొక్క విజయంగా ప్రధాని మోదీ కొనియాడారు, పాకిస్తాన్ “కాల్పుల విరమణ కోసం వేడుకుంది” అని, భారత దాడుల ఒత్తిడి వల్ల పాకిస్తాన్ DGMO ఒప్పందం కోరిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యొక్క భోపాల్ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై రాజకీయ చర్చను ప్రారంభించాయి. కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది.
Rahul Gandhi Ji took a dig at Narendra Modi for surrendering before Trump.
— Shantanu (@shaandelhite) June 3, 2025
America sent 7th fleet but Indira Gandhi didn’t surrender.
RSS people are coward, they surrender after just a little push.
— Rahul Gandhi Ji pic.twitter.com/NxDqp7YCU3





















