రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఎందుకు ఉండాలని అంటారు? అక్కడి కల్చర్ ఏమిటీ?
రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలా? అక్కడ ప్రత్యేకత ఏమిటీ? ఆ దేశంలో ఉంటే వారిలాగే ఎందుకు జీవించాలి? ఈ జాతీయం ఎప్పుడు ఎలా పుట్టింది?
‘రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలి’ అని చాలామంది అంటారు. ఏదైనా ప్రాంతంలో పరిస్థితులకు తగినట్లుగా ఇమిడిపోవాలని చెప్పేందుకు అలా అంటారు. ఇంతకీ అది ఎలా పుట్టింది? ఇందుకు రోమ్‌నే ఎందుకు ఉదాహరణగా చెబుతారు? అక్కడి జీవన విధానం ఏమిటనే సందేహం మీలో కూడా కలిగే ఉంటుంది. మరి.. అలా ఎందుకు అంటారో తెలుసుకుందామా!
‘When in Rome, do as the Romans do’ అనేది లాటిన్ నుంచి ఇంగ్లీషులోకి అనువాదమైంది. మధ్యయుగంలో సెయింట్ ఆంబ్రోస్ లాటిన్ భాషలో పలికిన మాటలే నేడు చెలామణిలో ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో ఇటలీలోని మిలన్‌లో మత పెద్దగా ఉన్న ఆండ్రోస్ రాసిన జాతీయ ఇది. క్రీ.శ. 387 సంవత్సరంలో ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ.. మనం ఏదైనా సమాజంలో ఉన్నప్పుడు అక్కడి చట్టాలు, ఆచారాలకు, సామాజిక నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ రోమ్‌ను ఉదాహరణగా చెప్పారు. ‘‘మనం రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. అది.. కాలక్రమేనా అన్ని దేశాలకూ పాకింది. దీన్ని ఇప్పుడు అంతా సర్వసాధారణంగా వాడేస్తున్నారు.
‘‘నేను ఎక్కడికైనా వెళ్తే.. అక్కడి ఆచారాలను, నిబంధనలను పాటిస్తాను. అక్కడి సమాజాన్ని గౌరవిస్తాను’’ అని చెబుతూ ఆంబ్రోస్ ఈ విషయాన్ని చెప్పారు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో గుర్తుంచుకోవలసిన విషయమని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్లే.. రోమన్లు చాలా క్రమశిక్షణ జీవించేవారట. వారి ఆచారాలనే కాకుండా.. ఇతరుల సాంప్రదాయలను కూడా గౌరవించేవారట. వారి జీవనశైలి ప్రపంచ దేశాలకు నచ్చడంతో.. ‘రోమ్‌లో ఉంటే రోమాన్‌లా ఉండాలి’ అనే జాతీయాన్ని వాడేస్తున్నాయి.
రోమాన్లు పాటించే నియమాలు ఇవే:
⦿ ఇతరుల జీవన విధానాన్ని గౌరవించాలి.
⦿ ఇతర సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి.
⦿ ఒకరి అలవాట్లను మరొకరిపై బలవంతంగా రుద్దకూడదు.
⦿ స్థానిక చట్టాలను గౌరవించాలి.
ఈ సూత్రాలను రోమన్లు తప్పకుండా పాటించాలనేది అప్పటి నియమాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అలాగే రోమన్లు విదేశాలకు వెళ్లినట్లయితే.. అక్కడి చట్టాలను, సాంప్రదాయాలను తప్పకుండా గౌరవించాలనే నిబంధన కూడా ఉంది. ఇతరుల నమ్మకాలను, ఆచారాలను హేళన చేయడం తప్పుగా పరిగణిస్తారు. ఇతరుల సమాజంలో కలవడమంటే.. జ్ఞానాన్ని విస్తరింపజేసుకున్నట్లేనని నమ్ముతారు. మనం ఒకరి సాంప్రదాయాన్ని గౌరవిస్తే.. వారు మనల్ని గౌరవిస్తారనేది రోమన్లు నమ్ముతారు.
‘రోమ్‌లో ఉంటే రోమాన్‌లా ఉండాలి’ అనే జాతీయం వల్ల రోమాన్‌లకు మంచి పేరే వచ్చింది. ఎందుకంటే.. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండేవారు.. ఇతర దేశాలకు వెళ్తే తప్పకుండా అక్కడి సాంప్రదాయాలను పాటిస్తారనే నమ్మకాన్ని సొంతం చేస్తున్నారు. అయితే, ఈ జాతీయాన్ని మనసులో పెట్టుకుని మనమే గొప్పవాళ్లం, ఇతర సంస్కృతులు తప్పు అనే ఆలోచించకూడదని కూడా అప్పటి పెద్దలు రోమన్లకు చెప్పడం గమనార్హం.
రోమన్లు ఇతర సమాజాల్లో కలిసేందుకు ఇష్టపడతారు. దీనివల్ల కొత్త విషయాలను తెలుసుకోవచ్చని భావిస్తారు. ఇతరులతో కలిసిపోయినప్పుడు వారి విధానాలు, కొత్త ఆలోచనలు గురించి తెలుసుకోవచ్చని నమ్ముతారు. ‘రోమన్..’ జాతీయం వల్ల అక్కడి ప్రజలు ఇతర దేశాల ప్రజలతో తేలికగా కలిసిపోవడం అలవాటైంది.
కొత్త విషయాలను, కొత్త భాషలను, సాంప్రదాయాలు గురించి తెలుసుకోవడం వారికి హాబీగా మారింది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం, ఇతర కుటుంబాలతో కలిసి భోజనం చేయడం, నృత్యాల్లో పాల్గోవడం వంటివి రోమన్ల సంస్కృతిలో భాగమైంది.
మీరు ఇతర దేశాలు లేదా రాష్ట్రాలను సందర్శించేప్పుడు తప్పకుండా ఈ జాతీయాన్ని గుర్తు పెట్టుకోండి. ‘రోమ్‌లో ఉంటే రోమాన్‌లా ఉండాలి’ అన్నట్లుగానే.. ఆయా ప్రదేశాల్లో అక్కడి సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉండాలి. మనం ఇతర దేశీయులతో స్నేహంగా ఉంటూ.. వారి ఆచారాలను గౌరవిస్తే.. వారు స్థానిక రహస్యాలను కూడా మనతో పంచుకుంటారట. కాబట్టి.. ఈ జాతీయాన్ని జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మనం ఇతరులను గౌరవిస్తే.. వారు మనల్ని గౌరవిస్తారనే విషయాన్ని మరిచిపోవద్దు. So.. When in Rome, do as the Romans do.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!