Daruma doll: ప్రధాని మోదీకి డారుమా డాల్ గిఫ్టుగా ఇచ్చిన జపాన్ ఆలయ పూజారి - దీని ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !
Japan Daruma doll: జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీకి.. ఆ దేశంలోని ప్రముఖ ఆలయ పూజారి వినూత్నమైన జ్ఞాపిక బహుకరించారు. దానికి పేరు డారుమా డాల్. ఇది చాలా ప్రత్యేకమైనది.

What is the Daruma doll: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం జపాన్ వెళ్లారు. టోక్యోలోని శోరిన్జాన్ డారుమా-జీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి సెయిషి హిరోసే ప్రధాని మోడీకి డారుమా డాల్ (Daruma Doll) అనే సాంప్రదాయిక జపాన్ బొమ్మను బహూకరించారు. ఈ డాల్ జపాన్ సంస్కృతిలో ధైర్యం, ఉత్కంఠ ,విజయాన్ని సూచిస్తుంది.
డారుమా డాల్ అంటే ఏమిటి?
డారుమా డాల్ జపాన్‌లోని ప్రసిద్ధ సాంప్రదాయిక బొమ్మ, ఇది బౌద్ధ మత స్థాపకుడు బోధిధర్మా (భారతీయ ముని) ఆధారంగా రూపొందిచారు. ఈ బొమ్మ సాధారణంగా ఎరుపు రంగులో, గుండ్రని ఆకారంలో ఉంటుంది. దాని డిజైన్ ప్రాంతం, కళాకారుడి ఆధారంగా మారుతూ ఉంటుంది.
డారుమా డాల్‌ను కొనుగోలు చేసినప్పుడు, దాని కళ్లు ఖాళీగా ఉంటాయి. కొనుగోలు చేసిన వ్యక్తి తన లక్ష్యాన్ని ఆశీర్వదించడానికి ఎడమ కంటి మీద ముద్ర వేస్తాడు. లక్ష్య సాధించిన తర్వాత, కుడి కంటి మీద ముద్ర వేస్తాడు. ఇది "ప్రారంభించు, విజయం సాధించు" అనే సందేశాన్ని ఇస్తుంది. ఈ బొమ్మ ఎల్లప్పుడూ తిరిగి నిలబడుతుంది, ఇది "విఫలం అయినా మళ్లీ లేచి పోరాడు" అనే జపాన్ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
It was an honour to meet Rev. Seishi Hirose, Chief Priest of Shorinzan Daruma-Ji Temple in Takasaki-Gunma. My gratitude to him for presenting a Daruma Doll. Daruma is considered to be an important cultural symbol in Japan and also has a connect with India. It is influenced by… pic.twitter.com/HjSWVx78sp
— Narendra Modi (@narendramodi) August 29, 2025
ఈ బొమ్మ మంచి అదృష్టం, విజయం, ధైర్యాన్ని తెస్తుందని జపాన్ ప్రజలు నమ్ముతారు. ఇది ప్రధానంగా న్యూ ఇయర్ సమయంలో ఇచ్చే జ్ఞాపికగా ప్రసిద్ధి చెందింది.
బోధిధర్మా భారతీయుడు కావడం వల్ల, ఈ డాల్ రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను సూచిస్తుంది. మోడీకి ఇవ్వడం ద్వారా, జపాన్ భారత్‌తో తమ సాంస్కృతిక ఆకర్షణ , భవిష్యత్ సహకారాన్ని వ్యక్తం చేసిందని అనుకోవచ్చు.
ఈ జ్ఞాపికను పొందిన తర్వాత, మోడీ ట్విటర్‌లో (X) పోస్ట్ చేసి, జపాన్ ప్రజల స్వాగతానికి ధన్యవాదాలు చెప్పారు. "టోక్యోలో భారతీయ సమాజం ప్రేమ తనను ఆకట్టుకుందన్నారు. వారి సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూ జపాన్ సమాజానికి దోహదపడటం నిజంగా ప్రశంసనీయం" అన్నారు.
VIDEO | Tokyo: PM Narendra Modi (@narendramodi) is presented with a Daruma doll by the priest at Shorinzan Daruma-ji Temple.
— Press Trust of India (@PTI_News) August 29, 2025
The Daruma doll is a traditional Japanese talisman symbolizing perseverance and good luck, often used to set and achieve personal or professional goals.… pic.twitter.com/zfjlPtnAdu
15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొనడానికి మోదీ జపాన్ వెళ్లారు. ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబాతో ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీలపై చర్చలు జరిగాయి. మాజీ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా కూడా మోడీ సమావేశం అయ్యారు.





















