అన్వేషించండి

Waqf Bill 2024: వక్ఫ్ బోర్డుల పరిధిలో లక్షల ఎకరాలు, రైల్వే డిఫెన్స్ తరవాత వాటా వీటిదే - మోదీ సర్కార్ టార్గెట్ అదే!

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లుని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. ఈ బిల్లులోని అంశాలపై పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది.

What is Waqf Amendment Bill: కేంద్రం వక్ఫ్ బిల్లుని తీసుకొచ్చింది. మోదీ 3.0 సర్కార్‌ తీసుకొచ్చిన మొట్టమొదటి కీలక బిల్లు ఇదే కావడం వల్ల ఇంకాస్త ఫోకస్ పెరిగింది. పైగా ముస్లిం సంఘాలు తీవ్రంగా అభ్యతరం వ్యక్తం చేస్తున్న క్రమంలోనే కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తులను పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బిల్ రూపొందించింది మోదీ సర్కార్. సెంట్రల్ పోర్టల్ ద్వారా వీటిని రిజిస్ట్రేషన్ చేయాలనీ తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డ్‌ని ఓ మాఫియాలాగా మార్చేశారని కేంద్రం ఇప్పటికే లోక్‌సభలో తీవ్ర విమర్శలు చేసింది. అందుకే కట్టడి చేసేందుకు ఈ బిల్ తీసుకొచ్చినట్టు క్లారిటీ ఇచ్చింది. అయితే..ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెబుతున్నాయి. పైగా ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ మండి పడుతున్నాయి. Waqf Act, 1995లో మార్పులు చేర్పులు చేసి  Waqf (Amendment) Bill తీసుకొచ్చారు. 

వక్ఫ్ అంటే ఏంటి..? ఈ బిల్లులో అసలు ఏముంది..?
 
ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏదైనా ఓ ఆస్తిని పూర్తిగా విరాళం ఇవ్వడమే ఈ వక్ఫ్. ఒక్కసారి ఇది వక్ఫ్ పరిధిలోకి వెళ్లిందంటే మళ్లీ విడిపించుకోలేరు. ఈ నిబంధన వల్లే కేంద్రం ఈ చట్టాన్ని సవరించాలని భావించింది. దేశవ్యాప్తంగా దాదాపు 30 వక్ఫ్ బోర్డులున్నాయి. ఈ బోర్డుల పరిధిలో రూ.1.2 లక్షల కోట్ల విలువైన 9 లక్షల ఎకరాల భూములున్నట్టు అంచనా. రైల్వే, డిఫెన్స్ తరవాత ఈ స్థాయిలో భూములున్నది వక్ఫ్ బోర్డుల వద్దే. అయితే...ఇదంతా ఓ మాఫియాలా తయారవుతోందని చెబుతున్న కేంద్రం పూర్తి స్థాయిలో వీటిపై నియంత్రణ అవసరమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పాత చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌, స్టేట్ వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయనుంది. ఇందులో ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులనూ సభ్యులుగా చేర్చనుంది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలుంటారు. సెంట్రల్ కౌన్సిల్‌లోనూ మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. 

ఆ అధికారం కలెక్టర్‌దే..

వక్ఫ్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తినా ఆ జిల్లా కలెక్టర్ కలగజేసుకుని పరిష్కరించాలి. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్‌కి ఉంటుంది. 1995 నాటి చట్టంలో ఈ అధికారాలన్నీ వక్ఫ్ ట్రిబ్యునల్ పరిధిలోనే ఉన్నాయి. అయితే..ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే పూర్తిగా ఈ బాధ్యతని కలెక్టర్‌కి అప్పగించాలని ప్రతిపాదించింది కొత్త బిల్లు. ముస్లింలలోని అగాఖానీలు, బొహరాలకు వర్గాలకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదించింది. వక్ఫ్‌కి సంబంధించిన ఏ ఆస్తినైనా ఆడిట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది ఈ కొత్త బిల్లు. ఓ వ్యక్తి వక్ఫ్‌కి విరాళం ఇచ్చినప్పుడు waqfnama పేరిట ఓ డాక్యుమెంట్‌ తయారు చేస్తారు. ఇది ఉంటే తప్ప అది విరాళంగా పరిగణించరు. వక్ఫ్ ఆస్తి అని అనడానికి ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చూపించాలని ఈ కొత్త బిల్లు తేల్చి చెబుతోంది. 

Also Read: Waqf Bill: వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్రం, ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తిన లోక్‌సభ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget