Viral Video: ఇదేం సెల్ఫీరా సామీ! ఫొటో తీసుకుని ఫోన్ విసిరేశాడు!
Viral Video: ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న ఆనందంలో ఫోన్‌ను నీటిలో విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన తర్వాత సెల్ఫీలు బాగా ట్రెండ్ అయ్యాయి. ఎంతలా అంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా, నచ్చినది చూసినా వెంటనే సెల్ఫీ తీసుకుంటాం. కొంతమంది సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న ఆనందంలో ఏకంగా సెల్‌ఫోన్‌నే విసిరేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.
— Tansu YEĞEN (@TansuYegen) September 11, 2022
ఇదీ జరిగింది
ఓ వ్యక్తి సరదాగా సముద్రంపైన పడవలో షికారు కొడుతుంటాడు. బోట్‌లో నిల్చొని ఒక చేతితో చేపను పట్టుకుని సెల్ఫీలు తీసుకుంటాడు. వివిధ ఫోజులలో ఫోటోలు తీసుకున్నాడు. అయితే ఆ సెల్ఫీ ఆనందం అయిపోగానే చేపను నీటిలో పడేయబోయి.. పొరపాటున ఫోన్‌ని సముద్రంలో విసిరేస్తాడు.
ఇంకేముంది తల పట్టుకొని తెగ బాధ పడ్డాడు. బోట్ వద్దకు వచ్చి నీటిలో ఫోన్ కోసం చూస్తున్న ఆ వ్యక్తి బాధ అంతా ఇంతా కాదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెల్ఫీ మోజులో
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి రామ్ నగర్‌కు చెందిన మనోజ్ (22) అతని తండ్రి హరి ఇటీవల ఓ సాయంత్రం డిండి ప్రాజెక్టుకు వెళ్లారు. డిండి ప్రాజెక్టు గేట్ల వద్ద సరదాగా సెల్ఫీ దిగుతుండగా మనోజ్ కాలు జారీ నీటిలో పడ్డాడు. ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలించగా తరువాతి రోజు మృతదేహం లభ్యమైంది.
మరో ఘటన
ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఇటీవల సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ క్లిక్ బటన్ నొక్కబోయి రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కటంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
సుచిత్ (17) అనే యువకుడు తన గదిలో ఉండి రివాల్వర్ తలవద్ద ఉంచుకుని మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాడు. అయితే పొరపాటున ఫోన్ లోని క్లిక్ బటన్ నొక్కే బదులు, రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో బుల్లెట్ అతడి తలలోంచి దూసుకెళ్లింది. తుపాకీ పేలిన శబ్దం విన్న సుచిత్ కుటుంబ సభ్యులు వెంటనే అతని గదిలోకి వచ్చారు.
రక్తం మడుగులో పడి ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే సుచిత్ గన్‌తో సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున మరణించాడా లేక గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Prashant Kishor Meets Bihar CM: నితీశ్ కుమార్‌తో పీకే భేటీ- ఈ ట్విస్ట్ వెనుక అంతరార్థం ఏంటో!
Also Read: Goa Political News: కాంగ్రెస్‌కు భారీ షాక్- భాజపాలోకి 8 మంది ఎమ్మెల్యేలు జంప్!