News
News
X

Goa Political News: కాంగ్రెస్‌కు భారీ షాక్- భాజపాలోకి 8 మంది ఎమ్మెల్యేలు జంప్!

Goa Political News: గోవాలో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు భాజపాలోకి జంప్ కానున్నట్లు సమాచారం.

FOLLOW US: 

Goa Political News: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి భాజపా పెద్ద షాక్ ఇచ్చింది. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు గోవా భాజపా చీఫ్ సదానందా శేఠ్ తెలిపారు.

" 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నారు. వీరు ఇప్పటికే సీఎం ప్రమోద్ సావంత్‌తో భేటీ అయ్యారు. "
-                                                              సదానందా శేఠ్, గోవా భాజపా చీఫ్

దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దెలీలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ ఈ రోజు భాజపాలో చేరనున్నట్లు సదానందా శేఠ్ తెలిపారు. ఈ విషయంలో వారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కూడా కలిసినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

11 మందిలో

గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో భాజపాకు 20 మంది, కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం భాజపాలోకి జంప్ అవనున్నారు. 2019 జులైలోనూ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు.

జోడో యాత్ర

మొత్తం 3,570 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.

కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉన్నాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేస్తున్నారు.

విలేజ్ షేప్‌లో ఉండే ఈ కంటెయినర్లను రోజూ ఓ కొత్త ప్లేస్‌లో పార్క్ చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనే శాశ్వస యాత్రికులకు రహదారులపైనే భోజనాలు ఏర్పాటు చేస్తారు. లాండ్రీ సర్వీస్‌లనూ అందిస్తారు.  ఐదు నెలల పాటు యాత్ర కొనసాగనున్నందున వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. రోజుకు 6-7 గంటల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 

ఈ యాత్రలో పాల్గొనే వాళ్లు రెండు బ్యాచ్‌లుగా విడిపోతారు. ఉదయం ఓ బ్యాచ్ 7 గంటల నుంచి 10.30 వరకూ, సాయంత్రం మరో బ్యాచ్ 3.30 గంటల నుంచి 6.30 వరకూ కొనసాగనుంది. రోజుకు 22-23 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిస్తారు. 

Also Read: Watch: జేసీబీలో ఆసుపత్రికి తరలింపు- వైరల్ వీడియో!

Also Read: Jammu Kashmir Bus Accident: లోయలో పడిన మినీ బస్సు- 11 మంది మృతి!

Published at : 14 Sep 2022 12:23 PM (IST) Tags: Goa Political News 8 Congress MLAs To Join BJP Sadanand Shet Tanavade

సంబంధిత కథనాలు

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ డీజీ హత్య కేసు నిందితుడు అరెస్ట్- దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ డీజీ హత్య కేసు నిందితుడు అరెస్ట్- దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !