Jammu Kashmir Bus Accident: లోయలో పడిన మినీ బస్సు- 11 మంది మృతి!
Jammu Kashmir Bus Accident: జమ్ముకశ్మీర్‌లో ఓ మినీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.
Jammu Kashmir Bus Accident: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 11 మంది మరణించారు. 25 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను మండిలోని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
పరిహారం
ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
UPDATE | 11 total deaths yet reported in the mini-bus accident that occurred in the Sawjian area of Poonch in J&K.
— ANI (@ANI) September 14, 2022
Saddened by loss of lives due to a road accident in Sawjian, Poonch. Condolences to bereaved families. May the injured recover soon. Rs. 5 lakh would be given to the next of kin of deceased. Directed Police and Civil authorities to provide best possible treatment to the injured.
— Office of LG J&K (@OfficeOfLGJandK) September 14, 2022
రాష్ట్రపతి సంతాపం
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముర్ము తెలిపారు.
Also Read: SCO Summit 2022: రెండేళ్ల తరవాత ప్రధాని మోదీ, పుతిన్ భేటీ, ఆ ఒప్పందం కుదురుతుందా?
Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్ నింపిన రాహుల్ గాంధీ- తగ్గేదేలే!