అన్వేషించండి

SCO Summit 2022: రెండేళ్ల తరవాత ప్రధాని మోదీ, పుతిన్ భేటీ, ఆ ఒప్పందం కుదురుతుందా?

SCO Summit 2022: రెండేళ్ల తరవాత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భేటీ కానున్నారు.

SCO Summit 2022: 

ఎరువులపై చర్చ..? 

ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో భేటీ అవనున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో భాగంగా...శుక్రవారం ఈ ఇద్దరూ ఉజ్బెకిస్థాన్‌ (Uzbekistan)లో  సమావేశం కానున్నట్టు...రష్యా వెల్లడించింది. రష్యా నుంచి ఫర్టిలైజర్స్‌ (Fertilisers)రాక తగ్గిపోవటం వల్ల భారత్‌లో మార్కెట్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయమై...ఈ ఇద్దరూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు...మరి కొన్ని ఆహార పదార్థాల ఎగుమతులపైనా చర్చ జరగనుంది. కొవిడ్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి పుతిన్, మోదీ ఫోన్‌లోనే మాట్లాడుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడూ...వీళ్లిద్దరూ ఫోన్‌ కాల్స్‌లోనే సంప్రదింపులు జరిపారు. దాదాపు రెండేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ ముఖాముఖి కలుసుకోనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించటమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుందని రష్యా మీడియా వెల్లడించింది. 2022 మొదట్లోనే రెండు దేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ 11.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏటా ఈ వాణిజ్య విలువ 120% మేర పెరుగుతున్నట్టు అంచనా. 

ఒప్పందం ఉంటుందా..? 

రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఫర్టిలైజర్లు దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య కాలంలో దాదాపు 1.03 బిలియన్ డాలర్ల విలువైన ఫర్టిలైజర్‌లు దిగుమతి చేసుకుంది భారత్. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 773.54 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే...దిగుమతులు ఎంత భారీగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. భారత వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాలే ఇవి. ఈ భారం తగ్గించుకునేందుకు...భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అవుతున్న తరుణంలో.. మూడేళ్ల పాటు ఫర్టిలైజర్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఓ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం. నిజానికి...ఈ ఒప్పందం ఈ ఏడాది మొదట్లోనే జరగాల్సింది. అయితే...ఉన్నట్టుండి రష్యాలో పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్‌పై మెరుపుదాడికి దిగింది ఆ దేశం. ఈ కారణంగా...భారత్‌ ఈ ఒప్పందం చేసుకోవటానికి వీల్లేకుండా పోయింది. ఎస్‌సీఓ సమ్మిట్‌లో భాగంగా...ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ (Shavkat Mirziyoyev)తోనూ భేటీ కానున్నారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది. 

Also Read: TS Congress Sentiment : కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం ! పాతబడిపోయిందా ? వర్కవుట్ అవుతుందా ?

Also Read: CM Jagan: జగన్ సర్కార్‌కు కేంద్రం ఊహించని షాక్! హోంశాఖ ప్రకటనతో నిరాశలో ప్రభుత్వం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Daryl Mitchel: డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Daryl Mitchel: డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
డెరిల్ మిచెల్ ప్రపంచ రికార్డు.. భారత్ పై వన్డేల్లో తొలి ఆటగాడిగా అరుదైన ఘనత
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget