News
News
X

Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్ నింపిన రాహుల్ గాంధీ- తగ్గేదేలే!

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఓ పోస్ట్ చేశారు.

FOLLOW US: 

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి స్పందన పెరిగింది. కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే కేరళ చేరుకుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, గొడుగు లేకుండానే రాహుల్‌ గాంధీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తల్లో రాహుల్ గాంధీ జోష్ నింపారు. పాదయాత్రకు సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు రాహుల్ గాంధీ.

" పాదయాత్రలో పాల్గొన్నవారి కాళ్లను బొబ్బలు వేధిస్తున్నప్పటికీ అవి మా యాత్రను ఆపలేవు. విద్వేషం, హింసతో ఎన్నికల్లో గెలవవచ్చేమో కానీ, వాటివల్ల దేశం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కారం కావు.                                        "
-   రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
 
కేరళలో

కేరళలో అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే రాహుల్‌ బృందానికి స్థానికుల నుంచి భారీ మద్దతు లభించింది. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు.

జోడో యాత్ర

మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.

కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉన్నాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేస్తున్నారు.

విలేజ్ షేప్‌లో ఉండే ఈ కంటెయినర్లను రోజూ ఓ కొత్త ప్లేస్‌లో పార్క్ చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనే శాశ్వస యాత్రికులకు రహదారులపైనే భోజనాలు ఏర్పాటు చేస్తారు. లాండ్రీ సర్వీస్‌లనూ అందిస్తారు.  ఐదు నెలల పాటు యాత్ర కొనసాగనున్నందున వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. రోజుకు 6-7 గంటల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 

ఈ యాత్రలో పాల్గొనే వాళ్లు రెండు బ్యాచ్‌లుగా విడిపోతారు. ఉదయం ఓ బ్యాచ్ 7 గంటల నుంచి 10.30 వరకూ, సాయంత్రం మరో బ్యాచ్ 3.30 గంటల నుంచి 6.30 వరకూ కొనసాగనుంది. రోజుకు 22-23 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిస్తారు. 

Also Read: Arvind Kejriwal In Gujarat: కాంగ్రెస్ పని అయిపోయింది- మన పని చూసుకుద్దాం: కేజ్రీవాల్

Also Read: Nabanna Chalo March: భగ్గుమన్న బంగాల్- భాజపా మార్చ్‌తో ఉద్రిక్తత, సువేందు అరెస్ట్!

Published at : 13 Sep 2022 05:31 PM (IST) Tags: Rahul Gandhi Blisters we will unite India

సంబంధిత కథనాలు

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!