Nabanna Chalo March: భగ్గుమన్న బంగాల్- భాజపా మార్చ్‌తో ఉద్రిక్తత, సువేందు అరెస్ట్!
Nabanna Chalo March: సచివాలయాన్ని ముట్టడించాలని భాజపా ఇచ్చిన పిలుపుతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
![Nabanna Chalo March: భగ్గుమన్న బంగాల్- భాజపా మార్చ్‌తో ఉద్రిక్తత, సువేందు అరెస్ట్! West Bengal Nabanna Chalo March Kolkata Police Detain BJP Leaders Suvendu Adhikari Rahul Sinha Ahead Of Rally To State Secretaria Nabanna Chalo March: భగ్గుమన్న బంగాల్- భాజపా మార్చ్‌తో ఉద్రిక్తత, సువేందు అరెస్ట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/13/5d364dfb04ba666bb39ae88474e81c0b1663067941379218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nabanna Chalo March: బంగాల్‌లో భాజపా చేపట్టిన 'నబానా చలో' మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ సచివాలయాన్ని ముట్టడించాలని భాజపా పిలుపునిచ్చింది. దీంతో భాజపా నేతలు, కార్యకర్తలు చేపట్టిన కవాతును పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అరెస్ట్
భాజపా చేపట్టిన మార్చ్‌ను అడ్డుకోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో భాజపా కార్యకర్తలు మరంత రెచ్చిపోయారు. ఓ పోలీసు వాహనానికి నిప్పంటించారు.
#WATCH | West Bengal: Police personnel in Kolkata thrash a BJP worker who had joined other members of the party in their call for a "Nabanna Chalo" march. pic.twitter.com/WxFmoCr212
— ANI (@ANI) September 13, 2022
నో పర్మిషన్
భాజపా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు రైళ్లు, బస్సుల్లో రాజధాని కోల్‌కతాకు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా భాజపా వెనక్కి తగ్గకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు కోల్‌కతాకు రాకుండా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ముందుజాగ్రత్త చర్యగా పలువురు నేతలను అరెస్టు చేశారు. కోల్‌కతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతోన్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి, మరో నేత లాకెట్ ఛటర్జీని మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దీదీ ప్రభుత్వంపై సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Viral News: పెళ్లి కూతురితో వింత అగ్రిమెంట్- వివాహం తర్వాత కూడా పంపించాలట!
Also Read: Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమి- ఈద్గా మసీదు వివాదంపై అక్టోబర్ 3న విచారణ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)