Viral News: పెళ్లి కూతురితో వింత అగ్రిమెంట్- వివాహం తర్వాత కూడా పంపించాలట!
Viral News: ఓ పెళ్లిలో వధువుతో వరుడి స్నేహితులు చేసుకున్న ఓ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral News: తమిళనాడులో ఓ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వివాహంలో పెళ్లి కూతురితో వరుడి స్నేహితులు ఓ ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. ఈ ఒప్పందం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ సంగతి
తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంబట్టి మునిసిపల్ పరిధిలోని కిజాపుదూర్ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ కూడా సూపర్‌గా ఆడతారట. తరచూ స్నేహితులతో కలసి హరిప్రసాద్ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అయితే హరిప్రసాద్‌కు తేనిలో నివాసం ఉండే పూజతో పెళ్లి ఫిక్సైంది.
అలా అయితేనే
ఉసిలంపట్టిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పెద్దలు వైభవంగా పెళ్లి జరిపించారు. అయితే వివాహ వేడుకల్లో వరుడి స్నేహితులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వధువు చేతిలో అగ్రిమెంట్ కాపీ పెట్టి అందులో సంతకం చేయాల్సిందేనని పట్టుబట్టారు.
అయితే ఆ అగ్రిమెంట్ కాపీ చూసిన వధువు అవాక్కయింది. వరుడి స్నేహితులు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీని అందరికి చదివి వినిపించింది. పెళ్లి తర్వాత కూడా హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడడానికి పంపించాలని ఆ అగ్రిమెంట్‌లో ఉంది.
పెళ్లికూతురు అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత వారి పెళ్లి జరిపించారు. ఈ తతంగం చూసి పెళ్లికి వచ్చిన వారు అవాక్కయ్యారు. పెళ్లయ్యాక తన భర్త ఫ్రెండ్స్‌తో గడపకుండా, ఆటలాడకుండా భార్యలు అడ్డుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, అందుకే ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ చెప్పారు.
వైరల్
ఈ విధంగా వరుడి స్నేహితులు వధువుతో చేసుకున్న అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రెండ్ భార్యతో అగ్రిమెంట్ అయితే చేయించుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఆ ఫ్రెండ్.. తన భార్య చుట్టూ తిరుగుతూ కాంట్రాక్ట్ చేయించుకున్న విషయం మర్చిపోతే ఏంటి సంగతి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. "పెళ్లయిన తర్వాత ఇవేవీ గుర్తుండవు ఫ్రెండ్స్" అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ అగ్రిమెంట్ మాత్రం కొత్తగా ఉంది.
Also Read: Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమి- ఈద్గా మసీదు వివాదంపై అక్టోబర్ 3న విచారణ!
Also Read: Sardar of Thieves: నా శాఖలో అందరూ దొంగలే, వారందరికీ నేనే సర్దార్: బిహార్ మంత్రి