అన్వేషించండి

Viral News: కొంప ముంచిన బెట్ సరదా, స్టేజ్‌పై వధువుకి ముద్దు పెట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Viral News: స్టేజ్‌పై వరుడు తనకు ముద్దు పెట్టాడన్న కోపంతో వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

Viral News:

ఆత్మగౌరవంతో..

యూపీలో ఓ వధువు ఉన్నట్టుండి పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. వరుడిపై కోపంతో వేదిక దిగి వెళ్లిపోయింది. పైగా పోలీసులకు ఫోన్ చేసి కేసు కూడా పెట్టింది. ఇంతకీ...వధువు అంతగా కోపగించుకోడానికి కారణం..వరుడు చేసిన ఓ చిలిపి పని. 300 మంది అతిథుల ముందు స్టేజ్‌పైనే వధువుకి ముద్దు పెట్టాడు వరుడు. దీన్ని అవమానంగా భావించిన యువతి వెంటనే వేదిక దిగి కోపంగా వెళ్లిపోయింది. పోలీసులకు ఫోన్ చేసి ఇదంతా చెప్పింది. ఆ తరవాత తేలిందేంటంటే...వధువుకి కోపం వచ్చింది వరుడు ముద్దు పెట్టినందుకు కాదు. అలా వేదికపైనే అందరూ చూస్తుండగానే ముద్దు పెడతానని వరుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో బెట్ కాశాడట. దీనిపైనే ఆగ్రహించిన వధువు "అబ్బాయి క్యారెక్టర్‌ నాకు నచ్చలేదు" అని తేల్చి చెప్పింది. ఇది కాస్తా...పెళ్లి రద్దు చేసుకునేంత వరకూ వెళ్లింది. ఆ తరవాత పోలీసులు కల్యాణ మంటపానికి వచ్చారు. ఇరు వర్గాలనూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తనను ముద్దు పెట్టుకోవడమే కాకుండా, అసభ్యంగా తాకాడని వధువు ఆరోపించింది. "తను నాకు ముద్దు పెట్టగానే చాలా అవమానంగా అనిపించింది. నా ఆత్మగౌరవం గురించి తను ఏ మాత్రం పట్టించుకోలేదు. అంత మంది ముందు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు" అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువు తల్లి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా...అది వర్కౌట్ అవలేదు. "ఫ్రెండ్స్ చెప్పినందు వల్లే వరుడు అలా ప్రవర్తించాడు. మా కూతుర్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాం. కానీ...మా మాట వినడం లేదు. కొద్ది రోజులు ఆగి ఆ తరవాత ఆమె నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని చూస్తున్నాం" వధువు తల్లి వెల్లడించారు. పెళ్లి రద్దు కాకుండా పోలీసులు ప్రయత్నించినా... ఫలితం లేకుండా పోయింది. "ఆ సంఘటన జరిగే సమయానికి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్ని రోజుల వేచి చూసి తరవాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం" అని పోలీసులు తెలిపారు.

లెహంగా నచ్చలేదని...

ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా పెళ్లిళ్లలో ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. వధువు తరపున వాళ్లు వరుడికి కట్న కానుకలు ఇస్తారు. వరుడి తరపు వాళ్లు వధువుకి బంగారం, బట్టలు కొనిస్తారు. ఇదిగో ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ పెళ్లిలో ఈ విషయంలోనే 
చిక్కొచ్చి పడింది. తనకు కొనిచ్చిన పెళ్లి బట్టలు మరీ చీప్‌గా ఉందని హర్ట్ అయిన వధువు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంది. కాస్ట్‌లీ లెహంగా కొనివ్వడానికి కూడా అంత ఆలోచిస్తారా అని మొహం పట్టుకుని అడిగేయడమే కాదు...నీతో పెళ్లి వద్దు అని ఆ వరుడికి తేల్చి చెప్పేసింది.
వరుడి కుటుంబ సభ్యులు వధువు కోసం రూ.10వేలు పెట్టి లెహంగా కొనుగోలు చేశారట. కానీ...అది పెళ్లి కూతురుకి నచ్చలేదు. లక్నోలో ఓ స్పెషల్‌ షాప్‌లో కొన్నామని వాళ్లు చెప్పినా ఆమె నమ్మలేదు. ఈ విషయంలో వరుడి కుటుంబ సభ్యులు కాస్త అసహనానికి గురయ్యారు. 
మాట మాట పెరిగింది. చివరకు అదో పెద్ద వివాదానికి దారి తీసింది. ఒకరిని ఒకరు తిట్టుకునే వరకూ వెళ్లింది. చివరకు పోలీసులనూ ఆశ్రయించారు. ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకుని రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదు. చాలా సేపు వాదనలు జరిగిన తరవాత "పెళ్లి రద్దు చేసుకోవటమే బెటర్" అనే నిర్ణయానికి వచ్చాయి రెండు కుటుంబాలు. 

Also Read: CM Mamata Steers Boat: బోటు నడిపిన సీఎం మమతా బెనర్జీ- వైరల్ వీడియో!

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget