CM Mamata Steers Boat: బోటు నడిపిన సీఎం మమతా బెనర్జీ- వైరల్ వీడియో!
CM Mamata Steers Boat: బంగాల్ సీఎం మమతా బెనర్జీ బోటు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CM Mamata Steers Boat: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మమతా.. ఓ గ్రామానికి వెళ్లేటప్పుడు బోటు నడిపారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
పర్యటన
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో పర్యటిస్తున్న మమతా బెనర్జీ.. కాపుకుర్, హస్నాబాద్ స్థానికులకు చలి దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. తాగు నీటి సమస్య గురించి స్థానికులు చెప్పడంతో తక్షణమే అన్ని ఇళ్లకు నీటి సరఫరా చేయించాలని అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ గ్రామానికి వెళ్లేటప్పుడు మమతా బోటు డ్రైవ్ చేశారు.
Hon’ble CM @MamataOfficial paid a unique visit to villages in North 24 Parganas on a boat.
— All India Trinamool Congress (@AITCofficial) November 30, 2022
In a lively mood she was seen steering the vessel herself.
With the wheels of progress and prosperity in her able hands, Bengal strides ahead. pic.twitter.com/paLVWsUymM
ఈ పర్యటనకు సంబందించిన 2 వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఒక వీడియోలో పడవ నడుపుతున్న దృశ్యాలు, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి చాక్లెట్స్, బొమ్మలు పంపిణీ చేసిన దృశ్యాలు ఉన్నాయి. మరో దానిలో ఒక స్థానిక మహిళతో కలిసి దీదీ చేనేత పని చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం మమతా బెనర్జీ ఓ స్థానికురాలి ఇంట్లో అన్నం, చేపల కూరతో భోజనం చేశారు.
Local artisans were seen sharing their craft with their beloved CM @MamataOfficial.
— All India Trinamool Congress (@AITCofficial) November 30, 2022
The GoWB has taken several initiatives to empower the local artisans and weavers in the state.
Under the Bengal Model, our culture and our craft shall always be celebrated. pic.twitter.com/v0obbSawSX
Also Read: India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్ ఎంప్లాయ్‌మెంట్ రేటు!