KA Paul: పాల్ గారి రేంజ్ ఇదీ - కాన్సాస్ సెనెట్‌లో ప్రసంగం - మరి ఇక్కడెందుకు ఇలా?
KA Paul speech: కాన్సాస్ స్టేట్ సెనెట్‌లో కేఏ పాల్ ప్రసంగించిన వీడియో వైరల్ గా మారింది.ప్రపంచ యుద్ధాల నివారణకు ఆయన ప్రార్థన చేశారు.

KA Paul speech in the Kansas State Senate: కిలారి ఆనంద్ పాల్ ఇక్కడ కామెడీగా రాజకీయాలు చేస్తారు కానీ ఆయన అమెరికాలో చాలా సీరియస్‌గానే ఉంటారు. తాజాగా ఆయనకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో ఆహ్వానం అందుకున్న ఆయన, సభలో ప్రపంచ శాంతి స్థాపన కోసం గళమెత్తారు. భారత్ , మెరికా దేశాలు ప్రపంచానికి రెండు కళ్ల వంటివని, ఈ రెండు అగ్రదేశాలు సమన్వయంతో ముందుకెళ్తేనే విశ్వవ్యాప్తంగా శాంతి నెలకొంటుందని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ప్రసంగంతో పాటు శాంతి ప్రార్థన చేసిన పాల్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న 58 యుద్ధాల పట్ల కె.ఎ. పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాల కారణంగా కోట్లాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ప్రజా ధనం వృధా కావడం మానవాళికి తీరని నష్టమని ఆయన సెనేట్ సభ్యులకు వివరించారు. ఈ విధ్వంసం ఆగిపోవాలని, దేశాల మధ్య వైషమ్యాలు తొలగిపోవాలని కోరుతూ ఆయన సెనేట్ సాక్షిగా ప్రత్యేక శాంతి ప్రార్థన చేశారు. యుద్ధాలకు వెచ్చించే వనరులను పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి మళ్లించాలని ఆయన కోరారు.
మత ప్రచారకుడిగా అమెరికాలో గుర్తింపు
భారత్-అమెరికా దేశాల మధ్య మైత్రి మరింత బలపడాల్సిన అవసరాన్ని పాల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో రెండు దేశాలు కలిసికట్టుగా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. అమెరికా లాంటి అగ్రరాజ్యాల చట్టసభల్లో భారతీయుడిగా శాంతి సందేశాన్ని వినిపించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక , రాజకీయ నాయకుడిగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి సెనేట్ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.
Today , Dr.K.A Paul addressed and prayed for the U. S. Kansas Members of the Senate ( Assembly) and prayed for America and India better relations . Also stop 58 Major Wars which is killing millions of lives and wasting trillions of dollars .
— Dr KA Paul (@KAPaulOfficial) January 16, 2026
America and India should lead the… pic.twitter.com/V1zC0TcYv2
గ్లోబల్ పీస్ మిషన్ అధ్యక్షుడిగా కేఏ పాల్
డాక్టర్ కె.ఎ. పాల్ స్థాపించిన గ్లోబల్ పీస్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గత మూడు దశాబ్దాలకు పైగా ఈ మిషన్ ద్వారా ఆయన అనేక దేశాల అగ్రనేతలు, ప్రెసిడెంట్లు, ఆధ్యాత్మిక గురువులతో కలిసి శాంతి చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశాల్లోనూ, మధ్యప్రాచ్య దేశాల్లోనూ శాంతిని నెలకొల్పేందుకు ఈ మిషన్ కీలక పాత్ర పోషించింది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికల ద్వారా యుద్ధాల వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలను వివరిస్తూ, దేశాల మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ మిషన్ నిరంతరం ప్రచారం చేస్తోంది. ఈ మిషన్ కేవలం శాంతి చర్చలకే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. చారిటీ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించడం ఈ సంస్థ చేస్తుంది. ప్రపంచంలోని 58 దేశాల్లో జరుగుతున్న ప్రస్తుత యుద్ధాలను ఆపివేసి, ఆ నిధులను ప్రపంచ ఆకలి కేకల నిర్మూలనకు మళ్లించాలన్నది గ్లోబల్ పీస్ మిషన్ ప్రధాన ఆశయం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















