BJP National Excutie : "గాంధీ"లను బీజేపీ వదిలించుకుంటోందా ? జాతీయ కార్యవర్గం నుంచి ఎందుకు తొలగించారు ?
బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్, మేనకా గాంధీలకు చోటు దక్కలేదు. రైతు చట్టాలపై రైతుల నిరసనలకు వారు అనుకూలంగా ప్రకటనలు చేస్తూండటమే కారణంగా భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో కీలక నేతలుగా మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు పార్టీలో పదవులు లేకుండా పోయాయి. ఇప్పటి వరకూ జాతీయ కార్యవర్గంలో సభ్యులుగా ఉన్న మేనకా గాంధీకి ఈ సారి చోటు దక్కలేదు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీకి కూడా స్థానం కల్పించలేదు. మేనకా గాంధీ మధ్య ప్రదేశ్ నుంచి .. వరుణ్ గాంధీ యూపీలోని ఫిలిబిత్ నుంచి ఎంపీలుగా బీజేపీ తరపున గెలిచారు. 80 సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. ఇందులో బీజేపీ కీలక నేతలందరికీ చోటు లభించింది. గతంలో మేనకా కేంద్రమంత్రిగా ఉండేవారు. తర్వాత ఆ పదవి కూడా ఇవ్వలేదు.
Also Read : మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ
వరుణ్ గాంధీ వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీ విధానానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనుపై ఆయన తీవ్రంగా స్పందిస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతల రక్తం కళ్లజూసిన వారిని బోనెక్కించాలని వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల గాంధీ జయంతి రోజున కొంత మంది బీజేపీ కార్యకర్తలు గాడ్సేను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారిపైనా విరుచుకుపడ్డారు.
Also Read : 'లఖింపుర్ ఖేరీ' కేసులో ఇద్దరు అరెస్ట్.. కేంద్రమంత్రి కుమారుడి కోసం గాలింపు
మారుతున్న రాజకీయ పరిణామాలతో గాంధీలకు ప్రాధాన్యం తగ్గించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వారి తీరు మరింత వివాదాస్పదం అయితే పార్టీకి చేటు చేస్తుందని వారు భావిస్తున్నారు. అయితే వరుమ్ గాంధీ బీజేపీ తరహా భావజాలంతో వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. యూపీ బీజేపీ తరపున సీఎం రేసులోనూ తాను ఉన్నానని గతంలో కూడా ప్రకటించారు. అయితే ఆయనను ఆ స్థాయి నేతగా బీజేపీ ఎప్పుడూ చూడలేదు.
Also Read : మోదీ జీ.. ఆ నోట్లపై గాంధీ ఫొటో తీసేయండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ
బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి , రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి ముఖ్య నేతలందరూ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యాభై మందిని ప్రకటించారు. ఏపీ నుంచి కన్నా లక్ష్మినారాయణకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కూడా ఎవరూ లేరు. తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించారు. పార్టీలకు ఉన్న బలాన్ని బట్టి.. బలమైన నేతలను బట్టి ఈ కమిటీలో ప్రాథినిధ్యం కల్పించారు. ఏపీలో చెప్పుకోదగిన బీజేపీ నేత ఎవరూ లేకపోవడంతో కన్నాకు అవకాశం దక్కింది.
Watch Video : స్పైస్ జెట్ ఎయిర్ హోస్టస్ విమానంలో డ్యాన్స్... నెట్టింట్లో వీడియో వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

