Lakhimpur Incident: 'లఖింపుర్ ఖేరీ' కేసులో ఇద్దరు అరెస్ట్.. కేంద్రమంత్రి కుమారుడి కోసం గాలింపు
లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.
Two persons have been taken into custody and are being questioned in the Lakhimpur Kheri violence case. Police have recovered empty bullet shells at violence site: UP Govt sources pic.twitter.com/HBUivFDdEB
— ANI UP (@ANINewsUP) October 7, 2021
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా కోసం వెతుకుతున్నట్లు లఖ్‌నవూ రేంజ్ ఐజీ లక్ష్మీ సింగ్ తెలిపారు. త్వరలోనే ఆశిష్‌ను అరెస్ట్ చేస్తామన్నారు. లఖింపుర్ ఖేరీ కేసులో ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆశిష్ పేరు ఉన్నట్లు ఐజీ స్పష్టం చేశారు. ఆయనపై హత్య సహా పలు అభియోగాలున్నాయన్నారు.
సంచలనం రేపిన ఘటన..
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్ గత ఆదివారం జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసింది.
అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను అజయ్ మిశ్రా ఖండించారు.
అడ్డుకున్న పోలీసులు..
మరోవైపు లఖింపుర్ ఖేరీ బాధితులను పరామర్శించేందుకు ర్యాలీగా వెళ్తోన్న పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను పోలీసులు అడ్డుకున్నారు. యమునా నగర్ (హరియాణా)- సహరాన్‌పుర్ (ఉత్తర్‌ప్రదేశ్) సరిహద్దు వద్ద సిద్ధూ.. మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
#WATCH | En route to violence-hit Lakhimpur Kheri, Punjab Congress chief Navjot Singh Sidhu-led march stopped at Yamuna Nagar (Haryana)- Saharanpur (Uttar Pradesh) border pic.twitter.com/wcqAKSUYuE
— ANI (@ANI) October 7, 2021
తప్పు చేసిన కేంద్ర మంత్రి, ఆయన కుమారుడ్ని ఏం చేయకుండా మమ్మల్ని మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారని సిద్ధూ ఆరోపించారు. లఖింపుర్ ఖేరీ బాధితులను పరామర్శించి తీరతామని తేల్చి చెప్పారు.
Also Read: PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ