అన్వేషించండి

Uttarakhand Violence: తీవ్ర హింసకు దారి తీసిన మదర్సా కూల్చివేత, ఉత్తరాఖండ్‌లో హై అలెర్ట్ - స్కూల్స్ బంద్

Uttarakhand Violence: ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానిలో మదర్సా కూల్చివేత ఘటన హింసకు దారి తీసింది.

Haldwani Violence: ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానిలో హింస చెలరేగింది. మదర్సాతో పాటు పక్కనే ఉన్న మసీదుని కూల్చి వేయడం స్థానికంగా అలజడి సృష్టించింది. అవి అక్రమ నిర్మాణాలని తేల్చి చెప్పిన అధికారులు కూల్చివేశారు. ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం హల్‌ద్వానీ నగరం అంతటా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవల్ని నిలిపిలేసింది. ఆందోళనలకారులు కనిపిస్తే కాల్చేయాలని (Shoot at sight) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మసీదుని, మదర్సాని కూల్చి వేస్తున్న సమయంలోనే ఈ అల్లర్లు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 50 మంది పోలీసులు గాయపడ్డారు. కొంత మంది మున్సిపల్ కార్మికులు, జర్నలిస్ట్‌లకూ గాయాలయ్యాయి. అధికారులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్‌ బయట వాహనాలకు నిప్పంటించడం మరింత ఆందోళనలకు దారి తీసింది. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము ఆ నిర్మాణాలను కూల్చామని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. బుల్‌డోజర్ వచ్చి వాటిని కూల్చి వేసే సమయంలో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మహిళలూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్‌లను ధ్వంసం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆ తరవాత రాళ్లు విసిరారు. దాదాపు 20 బైక్‌లతో పాటు ఓ సెక్యూరిటీ బస్‌నీ తగలబెట్టారు. పోలీస్ స్టేషన్‌నీ ధ్వంసం చేశారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 

"పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. ఎవరినీ రెచ్చగొట్టలేదు. అయినా వాళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌ని ధ్వంసం చేశారు. స్టేషన్‌లోని కొంత మంది సిబ్బందికీ నిప్పంటించేందుకు ప్రయత్నించారు"

- అధికారులు 

ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాజధాని డెహ్రడూన్‌లో సమావేశం అయ్యారు. అల్లర్లు సృష్టించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Delimitation Bill 2026: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
CM Chandrababu: ఇకపై రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి, అమరావతి పేరు సూచించింది ఆయనే: చంద్రబాబు
ఇకపై రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి, అమరావతి పేరు సూచించింది ఆయనే: చంద్రబాబు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget