Uttarakhand Flood: దేవభూమిలో జలప్రళయం.. వరదల ధాటికి 34 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు కనీసం 34 మంది మృతి చెందారు. సీఎంతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు.
ఉత్తరాఖండ్‌ను భారీ వరదలు వణికిస్తున్నాయి. వర్షాలు, వరదల ధాటికి 34 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. పిడుగులు, మెరుపులు, కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మృతి చెందినవారి కుటుంబాలకు రూ.4 చొప్పున పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి. ఇల్లు కోల్పోయిన వారికి 1.9 లక్షలు ఇవ్వనున్నారు. పశుసంపద కోల్పోయిన వారికి కూడా సాయం చేస్తామన్నారు.
So far 34 deaths, 5 missing in #uttarakhandrains. Rs 4 lakh compensation to the families of the deceased, those who lost their houses will be given Rs 1.9 lakhs. Possible help to be extended to those who lost their livestock: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/J8RhIeC3Jx
— ANI (@ANI) October 19, 2021
భారీ వర్షాలు..
వరుసగా రెండో రోజూ ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి.
#WATCH | A portion of the railway line connecting Kathgodam and Delhi near Gaula river in Uttarakhand's Haldwani was damaged earlier today amid heavy rainfall in the region. pic.twitter.com/onYhSwhdlK
— ANI (@ANI) October 19, 2021
ఉప్పొంగిన నదులు..
నైనితాల్ సరస్సులో నీరు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. సరస్సు పొంగిపొర్లడం వల్ల ఆ ప్రాంతంలోని రోడ్లు జలమయం అయ్యాయి. హల్ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. పితోర్‌గఢ్ జిల్లాలో భారీగా కురుస్తోన్న వర్షాలతో గోరీగంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతికి మున్సియారి-జౌల్‌జిబి రహదారి కొట్టుకుపోయింది.
#WATCH: All gates of Nanak Sagar Dam in Uttarakhand's Udham Singh Nagar opened following a rise in the water level due to heavy rainfall in the state. pic.twitter.com/A7GRZEXJD9
— ANI (@ANI) October 19, 2021
భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నందాకిని ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నైనితాల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!