Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' నుంచి తాజాగా 'గంగో రేణుకా తల్లి' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
Allu Arjun Pushpa 2 Movie News | డిసెంబర్ లో థియేటర్లలోకి వచ్చిన పుష్ప రాజ్ జోరు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యి నెల రోజులు గడిచినప్పటికీ ఇంకా ఆ మేనియా పోలేదు. తాజాగా ప్రేక్షకులకు థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన 'గంగమ్మ తల్లి జాతర'కు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ (The JATHARA song from) ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'గంగో రేణుకా తల్లి' వీడియో సాంగ్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. ఇక ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాతో అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపించాడు. 4 వారాల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టి కొత్త చరిత్రను సృష్టించింది. అయితే తాజాగా ఈ మూవీకి మెయిన్ హైలెట్ గా మారిన 'గంగమ్మ తల్లి జాతర' వీడియో సాంగ్ ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. నిజానికి సినిమా మొత్తంలోనూ హై మూమెంట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే అందులో థియేటర్లలో ఆడియన్స్ కి పూనకాలు తెప్పించిన సీన్లలో 'గంగమ్మ జాతర' ఎపిసోడ్ ప్రధాన హైలెట్ అని చెప్పొచ్చు. ఈ సీన్ లో అల్లు అర్జున్ చీర కట్టుకుని డాన్స్ చేసినప్పుడు, థియేటర్ దద్దరిల్లిపోవడంతో మంచి థ్రిల్ ను ఎక్స్పీరియన్స్ చేశారు ప్రేక్షకులు.
ఇక సాంగ్ లో ఫైట్, హీరో హీరోయిన్ ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ అద్భుతమైన పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, మహాలింగం పాడారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ కొట్టిన మ్యూజిక్ ప్రేక్షకులను కంటిరెప్ప వేయకుండా సీట్ ఎడ్జ్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసింది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు కన్నుల పండుగగా మారిన ఈ సాంగ్ వీడియో వెర్షన్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం. 'పుష్ప 2' మూవీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా 'గంగో రేణుకా తల్లి' పాటను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.
నాలుగు వారాల్లో కలెక్షన్ల ఊచకోత
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటిదాకా రూ.1799 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు అఫీషియల్ గా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అందులో "రికార్డు బ్రేకింగ్ రన్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను పుష్ప 2 రూల్ చేస్తుంది. వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ నాలుగు వారాల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 1799 కోట్ల గ్రాస్ ను రాబట్టింది" అంటూ అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఇక ఈ మూవీ కేవలం హిందీ వర్షన్ మాత్రమే రూ. 1000 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అలాగే బుక్ మై షోలో 19.5 మిలియన్ టికెట్లు అమ్ముడు కావడంతో, ఇప్పటి వరకు టికెట్ల విక్రయంలో టాప్ లో ఉన్న 'బాహుబలి 2' రికార్డును 'పుష్ప 2' బ్రేక్ చేసింది. మరి ఈ మూవీ 2000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందా? అనేది చూడాలి.
Read Also : Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!