అన్వేషించండి

US Man Killed: 'థాంక్యూ' చెప్పలేదని కత్తితో పొడిచి చంపేశాడు!

US Man Killed: అమెరికాలో దారుణ ఘటన జరిగింది. థాంక్యూ చెప్పలేదనే కారణంతో ఓ వ్యక్తిని పొడిచి చంపాడు దుండగుడు.

US Man Killed: థాంక్యూ చెప్పలేదనే కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు మరో వ్యక్తి. అమెరికాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

ఇదీ జరిగింది

అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ ఘటన జరిగింది. 'థాంక్యూ' చెప్పలేదని మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ‍్ర గాయాలై మృతి చెందాడు. 

పార్క్‌ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్‌ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది.

తెల్ల రంగు టీషర్ట్‌ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్‌ తెరిచాడు. అయితే, డోర్‌ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో తాను తెరవాలని కోరలేదని, థాంక్యూ చెప్పనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది.

బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్‌ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట‍్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. అనంతరం ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read: US President Joe Biden: స్టేజ్‌పై జో బైడెన్ తికమక- ఎటు వెళ్లాలో తెలియక!

Also Read: Amit Shah On PFI Raids: PFI కార్యాలయాలపై దాడులు- NSAతో అమిత్ షా కీలక భేటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget