Crime News: భార్యను ఫ్రెండ్స్‌తో రేప్ చేయిస్తూ వీడియోలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్న భర్త - యూపీలో ఘోరం !
UP Shocker: యూపీలో ఓ మహిళ తన భర్త.. ఆయన ఫ్రెండ్స్‌తో రేప్ చేయిస్తున్నాడని పోలీసలకు ఫిర్యాదు చేసింది. ఆ భర్త దుబాయ్‌లో ఉండి వీడియోల్లో చూస్తున్నాడని తెలిపింది.
UP Shocker Woman Claims Husband Allowed Friends to Rape: యూపీలోని బులంద్ షహర్‌లోని ఓ మహిళ దుబాయ్‌లో ఉంటున్న తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఆయన తన మిత్రులతో కలిసి ఇక్కడ అత్యాచారం చేయిస్తున్నారని వారితో వీడియో తీయించి వాటిని చూస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. దుబాయ్‌లో మెకానిక్ గా పని చేస్తున్న భర్త ఏడాదికి ఒకటి, రెండు సార్లు వస్తూంటారు. అయితే దుబాయ్ నుంచి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. మూడేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చినప్పుడు బులంద్ షహర్‌లోనే ఉండే కొంత మంది స్నేహితుల్ని ఇంటికి తీసుకొచ్చాడట. అప్పుడే తన ఇద్దరు మిత్రులతో కలిసి అత్యాచారం చేయించాడని ఆ మహిళ చెప్పింది.
జరిగిన విషయంపై ఎవరికైనా చెబితే విడాకులు ఇస్తానని భయపెట్టిన భర్త ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. తన స్నేహితుల్ని మాత్రం ఎప్పటికప్పుడు అత్యాచారం చేయడానికి పర్మిషన్ ఇచ్చాడట.తన భార్య ఒప్పుకుందో లేదో చెప్పడానికి వీడియోలు కూడా తీసి పంపాలన్నారట. అలా వారు వీడియోలను తీసి పంపుతున్నారని తన భర్త వాటిని చూసి ఆనందిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే ఇప్పుడు ఆ మహిళ గర్భవతిగా గుర్తించారు. భర్త దుబాయ్‌లో ఉండగా ఈమె ఇక్కడ గర్భవతి కావడం.. ఈ లోపు తన భర్త స్నేహితులతో అత్యాచారం చేయిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. భర్త దూరంగా ఉంటున్నందున.. భర్త స్నేహితులతో వివాహేతర బంధం పెట్టుకోవడం వల్ల గర్భం ధరించి ఉంటుందని ఇది బయటపడితే.. తన భర్త నిలదీస్తాడన్న కారణంగా ముందుగానే ఆమె భర్తపై ఫిర్యాదు చేసి ఉంటుందని ఆలోచిస్తున్నారు.
Also Read: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెళ్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
గల్ఫ్ లో ఆటోమోబైల్ మెకానిక్ గా పని చేస్తున్న ఆమె భర్తను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ వెళ్లి మెకాని క్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి .. తన భార్యను స్నేహితులతో అత్యాచారం చేయించి.. ఆ వీడియోను చూస్తాడని పోలీసులు అనుకోవడం లేదు. ఆమె ఫిర్యాదు చేసిన భర్త స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని అసలేం జరిగిందో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ అంశంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మహిళ ఫిర్యాదుపైనా అనుమానాలు ఉండటంతో ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.