Union Minister Narayan Rane: కేంద్రమంత్రి రాణెకు షాక్- అక్రమ నిర్మాణంపై భారీ ఫైన్!
Union Minister Narayan Rane: కేంద్రమంత్రి నారాయణ్ రాణెకు బొంబై హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది.
Union Minister Narayan Rane: కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు భారీ షాక్ తగిలింది. జుహు ప్రాంతంలో ఉన్న రాణెకు చెందిన భవనం పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బొంబై హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బృహన్ ముంబయి కార్పొరేషన్‌కు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ జరిగింది
Bombay High Court directs BMC to demolish unauthorized construction at Narayan Rane's bungalow and also imposes a fine of Rs 10 lakhs: Petitioner's Advocate Aditya Pratap pic.twitter.com/3U3xv5UdAZ
— ANI (@ANI) September 20, 2022
ఈ ఏడాది జూన్‌లో తమ అదనపు నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని రాణెకు చెందిన సంస్థ బీఎమ్‌సీని కోరింది. అయితే దీనిని బీఎంసీ తిరస్కరించింది. దీంతో రాణె హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిర్మాణాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జడ్), ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు బొంబై హై కోర్టు స్పష్టం చేసింది. దీంతో కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఫైన్
అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు నారయణ్ రాణెకు రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. రెండు వారాల్లోగా మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ విభాగంలో జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ఈ అంశంపై ఆరు వారాలు స్టే ఇవ్వాలని.. తాము సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని రాణె తరఫు న్యాయవాది కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. సివిక్ బాడీ గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాము దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని రాణెకు చెందిన కాల్కా స్థిరాస్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
గతంలో
కేంద్రమంత్రి నారాయణ్ రాణె తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేను ఉద్దేశించి రాణె చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని రాణె అప్పుడు వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది.
Also Read: Pilot Dies In Jet Crash: ఎయిర్ రేస్‌లో కుప్పకూలిన జెట్ విమానం- పైలట్ మృతి!
Also Read: Wall Collapses In Noida: నాలుగు రోజుల్లో రెండో ఘటన- గోడ కూలి నలుగురు మృతి