Wall Collapses In Noida: నాలుగు రోజుల్లో రెండో ఘటన- గోడ కూలి నలుగురు మృతి
Wall Collapses In Noida: ఉత్తర్‌ప్రదేశ్‌లో సరిహద్దు గోడ కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు.
Wall Collapses In Noida: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోయిడాలో ఓ సరిహద్దు గోడ కూలి పోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ఇదీ జరిగింది
నోయిడాలోని జల్ వాయు విహార్ సెక్టార్ 21 వద్ద మంగళవారం ఉదయం ప్రహారీ గోడ కూలింది. గోడ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్ వివరించారు.
చర్యలు చేపడతాం
గోడ కూలిన ఘటన గురించి నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ స్పందించారు.
Noida Authority had given contract for drainage repair work near Jal Vayu Vihar in Sec 21. We've been told when labourers were pulling out bricks, wall collapsed. It'll be probed. Received info of 2 deaths each(total 4)at Dist Hospital & Kailash Hospital; being verified: Noida DM pic.twitter.com/7A2eTmCMEE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022
ఇటీవల
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో సెప్టెంబర్ 16న ఇదే తరహా ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఆర్మీ ఎన్‌క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు.
గోడ కూలిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
Also Read: Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్ VS గహ్లోత్- మరి రాహుల్ సంగతేంటి!
Also Read: Uttar Pradesh News: బాత్రూమ్‌లో భోజనాలు- కబడ్డీ ప్లేయర్లకు ఘోర అవమానం!