By: Ram Manohar | Updated at : 18 Jan 2023 03:20 PM (IST)
ఉక్రెయిన్‌లో కీవ్‌కు సమీపంలో చాపర్ కుప్ప కూలిన ఘటనలో 16 మంది చనిపోయారు. (Image Credits: Twitter)
Ukraine Chopper Crash:
క్రాష్ అయిన చాపర్..
ఉక్రెయిన్‌లో భారీ ప్రమాదం జరిగింది. దేశ రాజధాని కీవ్‌లోని ఓ కిండర్‌గార్టెన్ బిల్డింగ్‌కు సమీపంలో ఓ చాపర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులతో పాటు ఉక్రెయిన్ మంత్రి కూడా ఉన్నారు. ఉక్రెయిన్ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్కీ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. విమానం కుప్ప కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టూ ఉన్న వాళ్లంతా గట్టిగా ఏడుస్తూ సాయం కోసం అర్థించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. కీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రొవరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నించింది. అటు ఉక్రెయిన్ కూడా రష్యా సేనలతో ఇక్కడ పోరాటం చేసింది. "ప్రమాదం జరిగిన సమయంలో కిండర్‌గార్టెన్‌లో స్టాఫ్‌తో పాటు పిల్లలూ ఉన్నారు. వాళ్లందరినీ సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నాం" అని కీవ్ గవర్నర్ వెల్లడించారు.
🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023
రష్యా పని ఖతం..!
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. రెండు వైపులా ఆస్తినష్టం వాటిల్లుతోంది. చర్చలకు రెడీ అని పైకి అంటున్నా..ఆ వాతావరణమే కనిపించడం లేదు. అయితే...ఈ యుద్ధం కారణంగా ఎక్కువగా నష్టపోతోంది రష్యానే అని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. మరో సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. యుద్ధం కొనసాగే కొద్ది రష్యా మరింత పతనం అవుతుందని తేల్చి చెప్పింది. Global Strategist and Analyst సర్వే ప్రకారం అంతర్జాతీయ సమాజం ముందు రష్యా ఓ "ఫెయిల్యూర్ నేషన్"గా నిలబడాల్సి వస్తుందని వెల్లడించింది. ఇప్పట్లో ఈ యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. అంతే కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే పదేళ్లలో రష్యా పూర్తిగా పతనమైపోతుందని సంచలన విషయం చెప్పింది. అప్పటికి రష్యా వైభవమంతా పోతుందని తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి రష్యా తనకు తానుగా సమస్యలు తెచ్చి పెట్టుకుంటోందనిపేర్కొంది. ఈ వైఖరి మార్చుకోకపోతే మరో పదేళ్లలో పతనం తప్పదని జోస్యం చెప్పింది. అట్లాంటిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. 2033 నాటికి రష్యా పతనం తప్పదని దాదాపు 46% మంది ఈ సర్వేలో అనుకూలంగా ఓటు వేశారు. ఈ యుద్ధం కారణంగా గతేడాదితో పోల్చి చూస్తే...ఉక్రెయిన్ ఆర్థికంగా 30% మేర పతనమైనట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి.
Also Read: world's coldest city: ఆ ఊర్లో ఫ్రిడ్జ్‌ల అవసరం లేదు - మనుషులంతా క్యాబేజీల్లా రెడీ అవుతారు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !