(Source: ECI/ABP News/ABP Majha)
UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడ్డ రిషి సునక్! లీడ్‌లో లిజ్ ట్రస్?
UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో ఇప్పటి వరకూ ముందంజలో ఉన్న రిషి సునక్, చివరి రౌండ్‌కు వచ్చే సరికి కాస్త వెనకబడినట్టు యూగవ్ సర్వే వెల్లడించింది.
UK PM Race:
యూగవ్ సర్వేలో తేలిందిదే..
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ కాస్త వెనకబడ్డారు. రిషి సునక్‌తో పోల్చుకుంటే ప్రత్యర్థి లిజ్ ట్రస్ 28 పాయింట్ల లీడ్‌లో ఉన్నట్టు యూగవ్ సర్వే వెల్లడించింది. గురువారం కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి సునక్, లిజ్ ట్రస్‌కు ఓటు వేయటం వల్ల చివరి రౌండ్‌లో వీరిద్దరే మిగిలారు. వీరిలో ఎవరికి మద్దతు ఎక్కువగా వస్తే, వారే ప్రధాని పదవిని చేపడతారు. అయితే ఇది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆగష్టు 4 వ తేదీ నుంచి బ్యాలెట్ పద్ధతిలో ఈ నియామకానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదల వుతుంది. సెప్టెంబర్‌లోగా ఎవరు ప్రధాని అన్నది తేలిపోతుంది. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అయిన యూగవ్ రిపోర్ట్‌లో మాత్రం రిషి సునక్ కాస్త వెనకబడినట్టు తెలుస్తోంది. 19 పాయింట్ల తేడాతో ట్రస్, రిషి సునక్‌ను అధిగమిస్తారని గత వారమే అంచనాలు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం...730 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల్లో 62% మంది తాము ట్రస్‌కు ఓటు వేసినట్టు చెప్పగా, 38% మంది మాత్రమే రిషి సునక్‌కు ఓటు వేసినట్టు వెల్లడించారు. ఇలా చూసుకుంటే 24% మేర ట్రస్ లీడ్‌లో ఉన్నట్టే. 2019లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం జరిగిన ఎన్నికల్లో 1,60,000 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రస్తుతం వారి సంఖ్య ఇంకాస్త పెరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సభ్యుల్లో మహిళలు, పురుషులతో పాటు అన్ని వయసుల వారిలో ఎక్కువ మంది ట్రస్‌కే మద్దతునిచ్చారు.
ఉన్నట్టుండి తగ్గిన మద్దతు
రిషి సునక్.. ఇప్పటివరకు ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అయితే...ఇప్పటి వరకూ ఆయనే లీడ్‌లో ఉండటం వల్ల ఆయన ప్రధాని కావటం లాంఛనమే అనుకున్నారంతా. కానీ..చివరి రౌండ్‌కు వచ్చే సరికి ఉన్నట్టుండి ఆయనకు మద్దతు తగ్గిపోవటం వల్ల ఆయన ప్రధాని అవుతారా లేదా అన్న ప్రశ్న తలెత్తింది.
Also Read: Arjun's Mother Passed Away: స్టార్ హీరో ఇంట విషాదం, యాక్షన్ కింగ్ అర్జున్ తల్లి మృతి