అన్వేషించండి

Aadhaar Card Update: ఇకపై పదేళ్లకోసారి ఆధార్​ అప్​డేట్ తప్పనిసరి!

Aadhaar Card Update: ఇకపై పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్ డేటే చేసుకోవాల్సిందేనని యూఐడీఏఐ  సూచించింది. అన్ని వయసుల వారికి ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

Aadhaar Card Update: ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల వారికి ఈ అప్​డేట్ తప్పనిసరి కాగా ఇదే తరహాలో పెద్దలు కూడా చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. పదేళ్లకు ఒకసారి వయోజనులు తమ ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ). ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారికి అప్​డేట్ తప్పని సరిగా ఉంది. కాగా వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్​ అప్​డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. మేఘాలయ, నాగాలాండ్​ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వయోజనుల ఆధార్​ కార్డులను అప్​డేట్​ చేశామని తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) సమస్య కారణంగా మేఘాలయలో ఈ ప్రక్రియ ఆలస్యంమైందని తెలిపింది. నాగాలాండ్, లద్దాఖ్​లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్డులు మంజూరు చేయాల్సి ఉందని యూఐడీఏఆ సంస్థ పేర్కోంది.

ప్రస్తుతం ఆధార్​ కలిగిన వారి శాతం 93.5 శాతానికి చేరుకుందని.. ఒక్క ఆగస్టు నెలలోనే 24.2 లక్షల మంది కొత్తగా నమోదయ్యారని చెప్పింది. దేశంలో దాదాపు 50,000 ఆధార్​ అప్​డేట్​ కేంద్రాలు ఉన్నాయని.. ఫోన్​ నంబర్, చిరునామాలను అప్​డేట్​ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్​ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయ పడుతుందని తెలిపింది. పేపర్​లెస్​ ప్రయాణాలను పేపర్​ లెస్​గా చేయాలని లక్ష్యంతో విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన 'డిజియాత్ర' ధ్రువీకరణ కోసం ఆధార్​ను అనుసందానం చేయనున్నట్లు పేర్కొంది.

ఆధార్ కార్డు పోతే.. డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా?

స్టెప్ 1: యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ‘uidai.gov.in’కు వెళ్లాలి.
స్టెప్ 2: అక్కడ మీరు ఆధార్ నంబర్(యూఐడీ) లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్(ఈఐడీ)ను ఎంచుకోవచ్చు.
స్టెప్ 3:  మీ పూర్తి పేరు, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 4: మీకు స్క్రీన్ మీద కనిపించే 4 అంకెల సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 5: ఓటీపీ బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
స్టెప్ 6: మీకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
స్టెప్ 7: వెరిఫై ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ మీకు మెసేజ్‌గా వస్తుంది.
స్టెప్ 8: ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఎంచుకున్నా, యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్‌ను పీడీఎఫ్ ఫైల్‌గా ఎంచుకోండి.
స్టెప్ 9: మీ వివరాలు ఎంటర్ చేయండి.
స్టెప్ 10: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
స్టెప్ 11: మీ ఓటీపీని ఎంటర్ చేసి ‘వాలిడేట్ అండ్ జనరేట్’పై క్లిక్ చేయండి.
స్టెప్ 12: అక్కడ దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోండి.

రీప్రింట్ చేసిన ఆధార్ కార్డు పొందడం ఎలా?

స్టెప్ 1: యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ‘uidai.gov.in’కు వెళ్లాలి.
స్టెప్ 2: గెట్ ఆధార్ సెక్షన్‌లో “Order Aadhaar Reprint”ను ఎంచుకోండి.
స్టెప్ 3: మీ ఆధార్ నంబర్(యూఐడీ) లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్(ఈఐడీ)ను ఎంచుకోవాలి.
స్టెప్ 4: సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. 
స్టెప్ 5: సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి
స్టెప్ 7: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్‌బాక్స్‌పై టిక్ చేసి, తర్వాతి పేజీలో సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 8: అక్కడ మీకు కావాల్సిన పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని, అవసరమైన నగదు చెల్లించాలి.
స్టెప్ 9: అకనాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
స్టెప్ 10: పేమెంట్ పూర్తయ్యాక, మీ ఆధార్ కార్డు ప్రింట్ అయి మీకు వచ్చేస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Heart Attacks : Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Rama Navami 2026: అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Embed widget