Pakistani Nationals: తెలంగాణ జైళ్లలో ఇద్దరు పాకిస్తానీలు- వద్దంటున్న పాక్ -ఎక్కడికి పంపాలి?
Pakistanis in Jails: పాకిస్తాన్ వాళ్లంతా ఇండియా వదిలి పెట్టిపోయారు. మరి జైళ్లలో ఉన్న వారి పరిస్థితేమిటి ? తెలంగాణ జైళ్లల్లో ఇద్దరు పాకిస్తాన్ ఖైదీలున్నారు.

Two Pakistani Nationals Still In Telangana Jails: జైలు శిక్షలు పూర్తి చేసుకున్న ఇద్దరు పాకిస్తానీ జాతీయులు తెలంగాణ జైళ్లలో అనేక సంవత్సరాలుగా నిర్బంధంలో ఉన్నారు. పాకిస్తాన్ వారిని పౌరులుగా అంగీకరించడం లేదు. హైదరాబాద్‌లో గూఢచర్యం కేసులో నిర్దోషిగా విడుదలైన 2 ఏళ్ల షేర్ అలీ కేశ్వానీ ఇప్పటికీ జైల్లోనే ున్నారు. 2015 నుండి చెర్లపల్లి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నారు. ఆయన పాకిస్తాన్ పౌరుడు.. వెళ్తే నేరుగా పాకిస్తాన్ వెళ్లిపోవాలి. ఇండియాలోకి అనుమతించరు. అయితే పాకిస్తాన్ మాత్రం ఆయన తమ పౌరుడు కాదని రానిచ్చేందుకు అంగీకరించడంలేదు.
ఉత్తరప్రదేశ్‌లో మరో కేసులో దోషిగా తేలిన మరో పాకిస్తానీ 2014లో శిక్షను పూర్తి చేసుకున్నారు. పోలీసులు అతన్ని ఆగ్రా జైలు నుండి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. శిక్షను పూర్తి చేసిన 50 ఏళ్ల వయసున్న మరో పాకిస్తానీ జాతీయుడు మొహమ్మద్ నజీర్ 2018 నుండి చంచల్‌గూడ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నాడు. నేపాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన నజీర్‌ను డిసెంబర్ 2013లో అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. స్థానిక కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.డిసెంబర్ 2018లో ఆయన తన శిక్షను పూర్తి చేసుకున్నారు.
ఇద్దరు పాకిస్తానీ జాతీయులను బహిష్కరించడానికి వీలుగా, తెలంగాణ జైలు అధికారులు పాకిస్తాన్ రాయబార కార్యాలయం ద్వారా కాన్సులర్ యాక్సెస్ ఏర్పాటు చేశారు. కానీ వారిని తమ పౌరులుగా గుర్తించేందుకు పాకిస్తాన్ అధికారులు నిరాకరించారు. శిక్షలు ముగిసిన తరవాత కాన్సులర్ యాక్సెస్ కోసం తీహార్ జైలు (ఢిల్లీ)కి పంపారు, కానీ పాకిస్తాన్ వారిని తమ పౌరులుగా అంగీకరించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం, వారిని బహిష్కరించే వరకు వారు నిర్బంధంలో ఉంచామని తెలంగాణ జైళ్ల శాఖ సీనియర్ అధికారి ఒకరు PTIకి తెలిపారు.
నిబంధనల ప్రకారం, ఒక విదేశీ పౌరుడి శిక్ష పూర్తయిన తర్వాత, వారిని సంబంధిత రాయబార కార్యాలయానికి అప్పగించిన తర్వాత వారి స్వదేశానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు పాకిస్థానీ ఖైదీలతో సమస్య సంవత్సరాలుగా కొనసాగుతోంది. పాకిస్తాన్ వారిని తమ వారిగా గా అంగీకరించడం లేదు, కాబట్టి వారు రాష్ట్ర జైళ్లలోనే నిర్బంధంలో ఉన్నారు. తెలంగాణలో నిర్బంధ కేంద్రాలు లేనందున, వారిని బహిష్కరించే వరకు జైలులోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు స్వల్పకాలిక వీసాలపై హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీ పౌరులు భారతదేశం విడిచి వెళ్లారు. తెలంగాణలో 200 మందికి పైగా పాకిస్తానీ జాతీయులు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లో ఉన్నారని, 190 మంది దీర్ఘకాలిక భారతీయ వీసాలపై ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి గడువు దాటి భారతదేశంలో పాకిస్తానీ జాతీయులు ఎవరూ ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 22న, కాశ్మీర్‌లోని పహల్గామ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు.





















