అన్వేషించండి

Twitter Layoffs: మరో 5,500 మందిని లేపేసిన మస్క్ మామ- ట్విట్టర్‌ ఉద్యోగులకు షాక్!

Twitter Layoffs: ఎలాంటి నోటీసులు లేకుండా మరో 5,500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ట్విట్టర్ తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.

Twitter Layoffs: ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఎలాన్ మస్క్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే చాలా మంది ఉద్యోగులను తీసేసిన మస్క్.. లేఆఫ్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా ఔట్‌సోర్సింగ్‌ విభాగంలోనూ మస్క్ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 4400 నుంచి 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

నోటీసులు లేకుండా!

అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విట్టర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్‌లు కొనసాగినట్లు సమాచారం. ట్విట్టర్‌కు చెందిన కంటెంట్‌ మోడరేషన్, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. అయితే వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశారట.

కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారట. అయితే తాజా కోతలపై ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

మస్క్ మామ

శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఇటీవల ఉద్యోగులతో మస్క్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

" మరింత ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమైతే ట్విట్టర్ దివాలా తీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలి. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను కూడా వదులుకునేందుకు సిద్ధపడాలి.                                 "
-         ఎలాన్ మస్క్

లేఆఫ్‌లు

ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత మస్క్.. లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపారు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశారు మస్క్.

అంతే కాదు. ఎంప్లాయిస్ అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లకు మినహాయింపునిస్తానని స్పష్టం చేశారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. Bloomberg రిపోర్ట్ ప్రకారం...ఇప్పటికే ఎలన్ మస్క్ అందరి ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్‌ను" తొలగిస్తున్నట్టు మెయిల్ పంపారు.

వారానికి కనీసం 40 గంటల పాటు పని చేయాలని ఆదేశించారు. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దాచాల్సిన పని లేదని అది అందరికీ తెలిసిన విషయమేనని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు కూర్చుని నింపాదిగా మాట్లాడుకోవాల్సిన సమయం కాదని, కేవలం యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూతోనే ట్విట్టర్ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే...ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని తేల్చి చెప్పారు.

Also Read: Elon Musk: సారీ చెప్పిన ఎలాన్ మస్క్! ట్విట్టర్‌తో పెట్టుకుంటే అంతే మరి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Embed widget