Twitter Employees New Rules: ఒళ్లొంచి పని చేయండి లేదంటే ఇళ్లకు వెళ్లిపోండి - ట్విటర్ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్!
Twitter Employees New Rules: బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌ను అనుకున్న టైమ్‌లోగా లాంచ్ చేయకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయని మస్క్ వార్నింగ్ ఇచ్చారు.
![Twitter Employees New Rules: ఒళ్లొంచి పని చేయండి లేదంటే ఇళ్లకు వెళ్లిపోండి - ట్విటర్ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్! Twitter Employees New Rules 24 hours 7 days work otherwise job will be lost Elon Musk Hires Twitter Engineers Twitter Employees New Rules: ఒళ్లొంచి పని చేయండి లేదంటే ఇళ్లకు వెళ్లిపోండి - ట్విటర్ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/b245426f0bf3b70c12b68779fa769e4f1667367905642517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Twitter Employees New Rules:
డెడ్‌లైన్..
మస్క్ రాకతో ట్విటర్‌లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. పాలసీలను పూర్తిగా మార్చేస్తామని చెబుతున్న ఆయన..అందుకు తగ్గట్టుగానే పాన్ల్ అమలు చేస్తున్నారు. బ్లూటిక్ కోసం డబ్బులు కట్టాలని ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా...ఇప్పుడు మరో అప్‌డేట్‌పై చర్చ జరుగుతోంది. ఉద్యోగులపై ఒత్తిడి పెంచేందుకు మస్క్ రెడీ అవుతున్నారట. ట్విటర్ మేనేజర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్‌ని నవంబర్ 7వ తేదీలోగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్. ఇందుకోసం ఎంత కష్టమైనా పడాల్సిందే అని తేల్చి చెప్పారు మస్క్. అవసరమైతే 24X7 పని చేయాలనీ ఆదేశించారు. ఇలా పని చేసేందుకు ఎవరు ఇబ్బంది పడినా ఉద్యోగం మానేయొచ్చని చాలా కచ్చితంగా చెప్పినట్టు సమాచారం. అందుకే...ఇప్పుడు ట్విటర్ ఎంప్లాయిస్‌లో ప్రెజర్ పెరిగిపోతోంది. ఉద్యోగం ఊడుతుందేమోనన్న భయంతో దినదినగండంగా పని చేస్తున్నారు. ఆన్‌టైమ్‌లో పని పూర్తి కాకపోతే...మస్క్ ఆగ్రహంతో ఊగిపోతారట. అంతకు ముందు స్పేసెక్స్ ఉద్యోగులు కొందరు ఇదే విషయమై అప్పట్లో ఓ లెటర్ రాసి పెద్ద దుమారమే రేపారు. ఇప్పుడు ఈ బాధలు ట్విటర్ ఎంప్లాయిస్ పడుతున్నారు. తమ ఆదేశాలను పెడ చెవిన పెట్టిన వారిని, కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోని వారిని వీలైనంత త్వరగా పక్కన పెట్టేయాలని చూస్తున్నారు మస్క్. అంతర్గత వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి కూడా. ప్రస్తుతం ట్విటర్ ఇంజనీర్లు తప్పనిసరిగా బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్‌ను అనుకున్న సమయంలోగా అందుబాటులోకి తీసుకురావాల్సిందే.
బ్లూటిక్ కోసం డబ్బులు..
ప్రస్తుతం బ్లూ టిక్ ఉన్న వాళ్లు త్వరలోనే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందట! నెలకు 4.99 డాలర్లతో ఆప్షనల్ ప్లాన్ ఉంటుందని తెలిసింది. ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఇస్తారని సమాచారం. కొత్తగా బ్లూ టిక్ కావాలని కోరుకునేవాళ్లకు 19.99 డాలర్లు ఫీజు వసూలు చేయనున్నారని వెర్జ్ రిపోర్టు చేసింది ఇప్పుడీ ప్లాన్‌లో ఉన్నవారు 90 రోజుల్లోగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని లేదంటే చెక్ మార్క్ తొలగిస్తారని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారని తెలిసింది. కొత్త ఫీచర్ కోసం కొందరు ఉద్యోగులను నియమించారు. బ్లూటిక్ కోసం చేసుకునే సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్‌ను కూడా పెంచుతారని అంటున్నారు. గతేడాది జూన్‌లో ట్విటర్ బ్లూని మొదలు పెట్టారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. వీరు ట్వీట్‌లను ఎడిట్ చేసేందుకూ అవకాశముంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ దీనిపై ఓ సర్వే కూడా చేశారు. ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్ ఉండాలనుకుంటున్నారా అని అడగ్గా దాదాపు 70% మంది అవును అనే సమాధానమిచ్చారు. ఆ తరవాతే ఈ నెల మొదట్లో కొందరు యూజర్‌లకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్విటర్‌కు అధికారికంగా "బాస్" అయ్యారు ఎలన్ మస్క్. దాదాపు నాలుగైదు నెలల పాటు ఈ డీల్ ఎన్నో మలుపులు తిరిగి చివరకు మస్క్ హస్తగతమైంది. కంపెనీని సొంతం చేసుకున్న మస్క్... ఇప్పుడు తన స్టైల్‌లో అందులో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Also Read: ED Summons Jharkhand CM: ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు- అరెస్ట్ చేస్తుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)