అన్వేషించండి

TVK MLA Vijay Damu : ఆటోడ్రైవర్ పేరుతో ప్రచారం చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు - కానీ కోటీశ్వరుడు - టీవీకే ఎమ్మెల్యేపై విమర్శలు

TVK Royapuram MLA : ఆయన ఆటోడ్రైవర్ అని సోషల్ మీడియాలో ఉదరగొట్టారు. సామాన్యుడని చెప్పి ప్రజలు ఓట్లేశారు. తీరా చూస్తే ఆయనకు అసలు ఆటోనే లేదు. ఇన్నోవా క్రిస్టా ఉంది.

TVK Royapuram MLA Vijay Damu owns Innova Crysta: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే  పార్టీ సృష్టించిన ప్రభంజనం ఒకెత్తయితే, రాయపురం నియోజకవర్గం నుండి గెలిచిన ఆటో డ్రైవర్  విజయ్ ధాము  చుట్టూ ఇప్పుడు రేగుతున్న వివాదం మరో ఎత్తు. సామాన్యుడిగా, ఆటో డ్రైవర్‌గా ప్రచారం చేసుకుని ఓట్లు పొందిన ఆయన.. గెలిచిన వెంటనే విలాసవంతమైన  ఇన్నోవా క్రిస్టా కారులో తిరుగుతుండటం,  కత్తితో కేక్ కోసి సంబరాలు చేసుకోవడంపై తమిళనాట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

 సామాన్యుడి ముసుగులో  ప్రీ-ప్లాన్డ్ పీఆర్ స్టంట్స్?

రాయపురం ఎన్నికల ప్రచారంలో విజయ్ ధాము తన ఆటోనే ప్రచార వాహనంగా వాడుకున్నారు.  నేను మీలో ఒకడిని, నిరుపేద ఆటో డ్రైవర్‌ను  అంటూ ప్రజల సానుభూతిని పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడీఎంకే ఉద్ధండుడు జయకుమార్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అయితే, గెలిచిన మరుసటి రోజే ఆయన ఖరీదైన ఇన్నోవా క్రిస్టా  కారులో దైవదర్శనానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఒక సాధారణ ఆటో డ్రైవర్ అంత ఖరీదైన కారును ఎలా మెయింటైన్ చేస్తారని, ఇదంతా ఎన్నికల కోసం ఆడిన పీఆర్ డ్రామా ( అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

 కత్తితో కేక్ కటింగ్.. పోలీసులకు ఫిర్యాదు!

విలాసవంతమైన కారు వివాదం చల్లారకముందే, విజయ్ ధాము మరో వివాదంలో చిక్కుకున్నారు. తన గెలుపు సంబరాల్లో భాగంగా బహిరంగంగా  కత్తి   తో కేక్ కోసి హంగామా చేశారు. గతంలో ఇలా కత్తితో కేక్ కోసినందుకు చెన్నైలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇలా ప్రవర్తించడంపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికే చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు అందాయి.  

 తగ్గుతున్న సింప్లిసిటీ  గ్రాఫ్.. విమర్శల వెల్లువ!

టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థులంతా సామాన్యులేనని, ప్రజల కోసమే పనిచేస్తారని గొప్పగా చెప్పుకున్నారు. కానీ, గెలిచిన తొలి వారంలోనే రాయపురం ఎమ్మెల్యే ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఓట్లు వేయించుకోవడానికి ఆటో.. సీటు దక్కగానే క్రిస్టా కార్లా  అంటూ స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే కూడా విజయ్ ధాము తీరును ఎండగడుతున్నాయి. ఇది కేవలం ఒక్క ఎమ్మెల్యే సమస్య మాత్రమే కాదు, టీవీకే పార్టీ పారదర్శకతపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.

 టీవీకే భవిష్యత్తుపై ప్రభావం?

ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ నిరూపించుకోవాల్సిన ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, ఇలాంటి వివాదాలు విజయ్‌కు తలనొప్పిగా మారాయి. విజయ్ ధాము తన కారుపై వస్తున్న ఆరోపణలను ఇంకా ఖండించలేదు. ఒకవేళ అది తన సొంత కారు కాదని, పార్టీకి చెందినదని చెప్పినా..  ఆటో డ్రైవర్ అనే సామాన్యుడి ఇమేజ్ మాత్రం దెబ్బతిన్నట్లేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకముందే విలాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ముద్ర పడటం టీవీకేకు రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా మారవచ్చు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Teacher Burns Child Private Part: వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!
వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!
SC Status Religious Conversion Verdict: మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget