అన్వేషించండి

Bengal new CM: బెంగాల్ సీఎంగా మహిళా నేత - మోదీ, షా మరోసారి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా?

BJP set to form Bengal govt: రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే విషయంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూంటారు మోదీ, షా. బెంగాల్ లోనూ అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BJP Bengal new CM: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, తొలిసారిగా అక్కడ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 293 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను  గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయడంతో, ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపైనే ఉంది. ఈ రేసులో ముగ్గురు కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తుండగా, అందులో  అగ్నిమిత్ర పాల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

 బెంగాల్ సీఎం రేసులో అగ్నిమిత్ర పాల్!

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,  అసన్సోల్ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ పేరు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన అగ్నిమిత్ర, రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. తాజా ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థిపై సుమారు  40,839 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం ఆమె బలాన్ని చాటిచెప్పింది. ఒకవేళ బీజేపీ హైకమాండ్ మహిళా నేతకు పట్టం కట్టాలని భావిస్తే, మమతా బెనర్జీకి ధీటైన ప్రత్యామ్నాయంగా అగ్నిమిత్ర పాల్‌కే మొదటి అవకాశం దక్కవచ్చు.

 గట్టి పోటీ ఇస్తున్న సువేందు అధికారి

ముఖ్యమంత్రి పదవికి మరో బలమైన పోటీదారుగా ప్రతిపక్ష నేత సువేందు అధికారి  నిలుస్తున్నారు. ముఖ్యంగా భబానీపూర్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని  15,000 కంటే ఎక్కువ ఓట్ల  తేడాతో ఓడించి, ఆమెకు కంచుకోట లాంటి చోట షాక్ ఇచ్చారు. నందిగ్రామ్ తర్వాత ఇప్పుడు భబానీపూర్‌లోనూ దీదీ ని ఓడించడంతో, పార్టీలో ఆయన ప్రాధాన్యత అమాంతం పెరిగింది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నాయకుడిగా సువేందు పేరును పార్టీ పెద్దలు  పరిశీలిస్తున్నారు. 

 రేసులో సమిక్ భట్టాచార్య కూడా..

వీరిద్దరితో పాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య  పేరు కూడా సీఎం అభ్యర్థుల పరిశీలనలో ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, వివాదరహితుడైన నాయకుడిగా ఆయనకు ఢిల్లీ పీఠం వద్ద మంచి గుర్తింపు ఉందని సమాచారం. పార్టీ సీనియర్లు , ఆర్ఎస్ఎస్  ఆశీస్సులు ఆయనకు ఉండటం అదనపు బలంగా మారుతోంది.

 మే 9న ప్రమాణ స్వీకారం?

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని  మే 9వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అగ్నిమిత్ర పాల్ రూపంలో ఒక మహిళకు అవకాశం ఇస్తారా? లేక మమతను మట్టికరిపించిన సువేందును ఎంచుకుంటారా? అన్నది మరో 24 గంటల్లో తేలిపోనుంది.  అగ్నిమిత్ర పాల్ ఎంపిక జరిగితే, అది బెంగాల్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది. సువేందు అధికారి అనుభవం, అగ్నిమిత్ర ఇమేజ్ మధ్య బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget