Top Headlines Today: కృష్ణలంక రిటైనింగ్ వాల్‌పై క్రెడిట్ పాలిటిక్స్, అత్యవసరమైతేనే బయటకు రావాలన్న మంత్రి పొన్నం
Andhra Pradesh News | ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాణాలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సైతం రంగంలోకి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
కుట్రలు జరుగుతున్నాయేమో- చంద్రబాబు సంచలన కామెంట్స్
వరద బాధితులకు సహాయం చేయడంలో అలసత్వం చేసిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు... కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. వరద నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించినట్టు చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా విజయవాడలోనే ఉందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని.. పది జిల్లాల నుంచి వస్తుందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు- ప్రజలకు మంత్రి పొన్నం సూచన
హైదరాబాద్‌లోని వరద ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హిమాయత్ సాగర్ జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. మరో రోజు వర్షాలు పడినా హిమాయత్ సాగర్ జలాశయం నిండిపోతుందన్నారు. జలాయశయం నిండితే కింద ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ,రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు. మరో 5 వేల క్యూసెక్కుల నీళ్ళు వస్తే ఓవర్ ఫ్లో అవుతుందన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్, సిద్ధూ, నిర్మాతలు... వరద బాధితుల సహాయార్థం ఎవరెంత విరాళం ఇచ్చారంటే?
ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, విపత్తు ముంచెత్తినా... తమ వంతు సాయం చేయడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎల్లప్పుడూ ఓ అడుగు ముందు ఉంటారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితుల సహాయార్థం చేపట్టే చర్యల కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరొక 50 లక్షల రూపాయలు ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కృష్ణలంక రిటైనింగ్ వాల్‌పై రాజకీయం- క్రెడిట్ మాదంటే మాదంటున్న టీడీపీ, వైసీపీ
విజయవాడ (Vijayawada) వాసులని ఊహించని వరదలు ముంచెత్తాయి. సింగ్‌నగర్ తో పాటు నగర శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అక్కడి వారంతా ఉంటున్న ఇళ్లు వదిలి తట్టాబుట్టా సద్దుకుని... పునరావాసకేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి. అలా కాకపోతే... ముంపులోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. అయితే... ఎప్పుడూ నీట మునిగే... కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలు మాత్రం వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. దీనికి కారణం కృష్ణలంక రిటైనింగ్ వాల్. ఇదే ఆ ప్రాంతాలను వరద ముంచెత్తకుండా కాపాడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జగన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ - బుడమేరు వ్యాఖ్యల్లో లెక్క తప్పిందా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంపై ఆయినా అవగాహన ఉండదని ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులే చదువుతారని టీడీపీ నేతలు తరచూ ఆరోపిస్తూ ఉంటారు. తాజాగా వరద ప్రాంతాలను సందర్శించి ఆయన చేసిన విమర్శలు మరోసారి అలాంటి వాటిని జగన్ ఎదుర్కోవాల్సిన అవసరం కల్పిచింది. వరదల్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్‌గా జగన్ పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు ఇంటిని ముంచడానికే బుడమేరు గేట్లు ఎత్తారని కూడా అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి