Jagan Politics : జగన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ - బుడమేరు వ్యాఖ్యల్లో లెక్క తప్పిందా?
Andhra Pradesh : వరదలకు చంద్రబాబే కారణం అని జగన్ చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. చంద్రబాబు ఇల్లు మునగకుండా బుడమేరు గేట్లు ఎత్తారని ఆయన చేసిన విమర్శలపైనా అదే పరిస్థితి కనిపిస్తోంది.
Trolling in social media on Jagan : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంపై ఆయినా అవగాహన ఉండదని ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులే చదువుతారని టీడీపీ నేతలు తరచూ ఆరోపిస్తూ ఉంటారు. తాజాగా వరద ప్రాంతాలను సందర్శించి ఆయన చేసిన విమర్శలు మరోసారి అలాంటి వాటిని జగన్ ఎదుర్కోవాల్సిన అవసరం కల్పిచింది. వరదల్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్‌గా జగన్ పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు ఇంటిని ముంచడానికే బుడమేరు గేట్లు ఎత్తారని కూడా అన్నారు. ఈ మాటలపై సోషల్ మీడియాలో ఆయనను రకరకాలు విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
బుడమేరుకు గేట్లు ఉండువు.. ఏలూరు వైపు ప్రవాహం
బుడమేరుకి వచ్చిన వరద వల్ల విజయవాడ ఎక్కువగా ఎెఫెక్ట్ అయింది. అయితే ఈ బుడమేరు గేట్లు ఎత్తడం వల్లనే విజయవాడ మునిగిపోయింది. గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నివాసం మునిగిపోయేదని.. అందుకే ఆయన నివాసాన్ని కాపాడుకోవడానికి గేట్లు ఎత్తారని జగన్ ఆరోపణ. నిజానికి బుడమేరు అనేది ఒక ఏరు మాత్రమే. అది ప్రాజెక్టు కాదు. గేట్లు ఉండవు. ఆ విషయం జగన్ కు తెలియలేదు. అదే సమయంలో అసలు బుడమేరు నీరు.. చంద్రబాబు ఇంటి వైపు రాదు. కృష్ణా జిల్లాలో ఓ వైపు నుంచి ఏలూరు వైపు బుడమేరు ఉంటుంది. దాంతో ఆ వాదనపైనా ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తంగా బుడమేరుకు 30వేలకు క్యూసెక్కుల నీరే వచ్చి ఉంటుందని.. కానీ.. ప్రకాశం బ్యారేజీ వద్దకు పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు పారిందని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబును నిందించాలన్న ఆతృతతోనే ఇలాంటి ఆరోపణలు చేశారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
బుడమేరు అంటే ఏంటో తెలియదు.. ఎలా ప్రవహిస్తుందో తెలియదు.. బుడమేరుకి గేట్లు ఉంటాయి అంటున్నాడు.. మా ఇల్లు ఎక్కడ, బుడమేరు ఎక్కడ. కనీస అవగాహన లేని వాడు ఈ జగన్ రెడ్డి. ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారులే అనే విచ్చలవిడితనం.#APGovtWithFloodVictims#CBNsFatherlyCare#2024APFloodsRelief… pic.twitter.com/xTHA7OyfH0
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024
మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే విమర్శలపైనా ట్రోలింగ్
వైఎస్ జగన్ ఈ వరదల్నిమ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేశారు. అయితే అలా ఎందుకు అన్నారో చెప్పలేదు, ముందస్తు హెచ్చరికలు వచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. నిజానికి శ్రీశైలం, సాగర్ డ్యాముల నుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్లుగా వదిలేస్తూనే ఉన్నారు. పులిచింతల నుంచి కూడా వదిలేస్తున్నారు. కానీ ఊహించనంత వరదలు వచ్చాయి. ఓ సారి ఎలాంటి వరదలు రాకపోయినా పై నుంచి వచ్చిన వరదలతో శ్రీశైలండ్యాం నుంచి నీటిని మొత్తం వదిలినా బ్యాక్ వాటర్ తో కర్నూలు కూడా నీట మునిగింది. ఇప్పుడు వర్షాల వల్ల వచ్చిన నీటి వల్లే వరద వచ్చినా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ విమర్శిస్తున్నారని.. నిందించాలని తప్ప.. కనీస ఆలోచన కూడా చేయడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
బెజవాడను ముంచిన బుడమేరు చరిత్ర : #floodainap #apfloods #andhrafloods #budameru #vijayawadafloods pic.twitter.com/moXXoD3TTf
— Dr. Chinnarao (@Chinnarao_C) September 3, 2024
సీఎంగా ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ - ఇప్పుడు బురదలోకి దిగి పరిశీలన
జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ వరదప్రాంతాల పరిశీలనకు ముందుగా వెళ్లలేదు. అంతా అయిపోయిన తర్వాత నష్ట పరిశీలనకు వెళ్లారు. ఓ సారి బాపట్ల వద్ద ఇలా నష్టపరిశీలనకు వెళ్లినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేసి రెడ్ కార్పెట్ వేయడం.. ఆయన స్టైల్ గాఆ వేదిక నుంచి పాడైపోయిన పంట పొలాల్ని పరామర్శించడం వైరల్ అయింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బురదలోకి దిగి పరిశీలన చేశారు. ఈ అంశాన్ని టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు.