Top Headlines Today: మరికొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్!- మేడిగడ్డ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం
AP Telangana Latest News 13 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today - ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి - వైసీపీ కొత్త డిమాండ్ !
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఎన్నికలకు ముందు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు ఈ గడువు ఈ ఏడాది జూన్ తో ముగిసిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని డిమాండ్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ రెడీ అయింది. ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్.. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వైవీ సుబ్బారెడ్డి ఈ డిమాండ్ వినిపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆశావహులను బుజ్జగిస్తున్న టీడీపీ ట్రబుల్ షూట్ టీమ్, పది స్థానాలను సెట్ చేసిన నేతలు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections ) పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party ) కసరత్తును వేగవంతం చేసింది. వీలయినంత త్వరగా అభ్యర్థులను కొలిక్కి తేవాలని చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu)భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై ఓ అవగాహనకు వచ్చిన చంద్రబాబు... మరికొన్ని సీట్లపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లపై క్లారిటీ రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ కోల్పోయే సీట్లపై ఇంకా కొలిక్కి రాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నల్గొండ సభకు బీఆర్ఎస్ నేతల బృందం - ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్న నేతలు
తెలంగాణలో జల జగడం ముదురుతోంది. ఓ వైపు మేడిగడ్డ సందర్శనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బయలుదేరగా.. మరోవైపు తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి కాంగ్రెస్ పార్టీ దాసోహమైందని ఆరోపిస్తూ నల్గొండలో తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. తెలంగాణ భవన్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో 'ఛలో నల్గొండ' భారీ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (HarishRao), పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు బయలుదేరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'ఇసుకలో పేక మేడలు కట్టారా అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
కృష్ణా నదీ జలాల సందర్శనకు సంబంధించి ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం బృందం వెళ్లనున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో స్వల్ప కాలిక చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. 'సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు. సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం చర్చించి వాస్తవాలు చెప్పాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలు, వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
కాంగ్రెస్(Congress) ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం పకడ్బందీగా అమలు చేస్తున్న రేవంత్(Revanth Reddy) సర్కార్...మరో రెండు హామీలు అమలకు పచ్చజెండా ఊపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి