Top Headlines Today: హాట్ హాట్‌గా ఏపీ బడ్జెట్ సమావేశాలు- ఎన్నికల తరువాత తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్
AP Telangana Latest News 06 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు...నిన్న రాజయ్య, నేడు ఎంపీ వెంకటేశ్
బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ హైకమాండ్ రెడీ అవుతుంటే...నేతలు మాత్రం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నిన్న మాజీ డిప్యూటీ సీఎం (Former Deputy Cm) తాడికొండ రాజయ్య (Tadikonda Rajaiah) పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా పెద్దపెల్లి (Peddapally Parliament) సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ (Venkatesh Nethakani) అనుహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించడంతో వెంకటేష్ నేత పార్టీ వీడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సర్పంచ్‌ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం - పలు చోట్ల ఉద్రిక్తత
పంచాయతీల నిధులను ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపిస్తూ.. ఏపీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీని ముట్టడిస్తామని సర్పంచ్‌లు ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు ఎవరైనా అసెంబ్లీ వైపు వస్తే అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసుల వలయాలను దాటుకుని అసెంబ్లీకి చేరుకున్న సర్పంచ్ లు ఆందోళనచేసారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి - ఎమ్మెల్సీ కవిత డిమాండ్
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్- కృష్ణ పరివాహక ప్రాంత నేతలతో సమావేశం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ మధ్య కాలంలో ఆయన కాలికి సర్జరీ కూడా జరిగింది. అన్నింటినీ అధిగమించి తొలిసారిగా తెలంగాణ భవన్‌కు రావడంపై శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్... కృష్ణా నది పరివాహక ప్రాంత నేతలతో సమావేశం అయ్యారు. అక్రమంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో - టీడీపీ సభ్యులపై ఒక రోజు వేటు
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ గట్టిగా డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి