KCR IN Telangana Bhavan: తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్- కృష్ణ పరివాహక ప్రాంత నేతలతో సమావేశం
KCR In Telangana Bhavan: తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్... కృష్ణా నది పరివాహక ప్రాంత నేతలతో మాట్లాడనున్నారు
KCR In Telangana Bhavan: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ మధ్య కాలంలో ఆయన కాలికి సర్జరీ కూడా జరిగింది. అన్నింటినీ అధిగమించి తొలిసారిగా తెలంగాణ భవన్‌కు రావడంపై శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్... కృష్ణా నది పరివాహక ప్రాంత నేతలతో సమావేశం అయ్యారు. అక్రమంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై నేతలతో మాట్లాడి పోరాట కార్యచరణ పై చర్చిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి సారి తె లంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ తన నివాసంలో కిందపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించి తుంటి సర్జరీ చేశారు. తుంటి సర్జరీ అనంతరం కేసీఆర్ ఇటీవల కోలుకున్నారు. దీంతో ఈనెల 2న అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత పార్లమెంటరీ సమీక్షా సమావేశాల్లో కేసీఆర్ తరచూ పాల్గొంటున్నారు. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ సీఎం.. కేసీఆర్ సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని ప్రకటించిన హరీష్ రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు, రానేరాదన్న తెలంగాణను 14ఏళ్లు పోరాడి సాధించిన నేత కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ సంక్షేమంకోసం, ప్రజల అభివృద్ధికోసం అలుపెరగని పోరాటం చేస్తారు, రాబోయే రోజుల్లో మీరే చూస్తారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజల కష్టాలు పట్టడం లేదు.. ప్రజలకు కష్టాలు పెరగడమే కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చిన మార్పు అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్లగొండలో భారీ బహిరంగసభ
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రాజెక్టుల అప్పగింత వల్ల.. తెలంగాణ రైతాంగం భారీగా నష్టపోతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది.