అన్వేషించండి

Top Headlines Today: విజయవాడలో పీసీసీ చీఫ్ షర్మిల నిరసన! 15 రోజుల్లో BRS ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టు ఆదేశం - నేటి టాప్ న్యూస్

Telagnana News Today | బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏపీ కేబినెట్ సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ, తెలంగాణలో నేటి టాప్ 5 హెడ్ లైన్స్ ఇవీ.

రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యల రచ్చ! విజయవాడలో వైఎస్ షర్మిల నిరసన
రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత అని, అలాంటి వ్యక్తిని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తుంటే ఆ పార్టీ అధిష్ఠానం అస్సలు స్పందించడం లేదని ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ నేతలు ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోదీ, షా లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతుందని షర్మిల అన్నారు. ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. వారి ద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. నల్గొండలో ఉన్న బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి తీసుకోకుండా ఆఫీస్‌ కట్టి... ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చేయాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల స్థాపనలో ప్రోత్సాహం - తెలంగాణ MSME పాలసీలో కీలక విషయాలు
సొంత ఉపాధి కేంద్రం పెట్టుకోవాలనేది యువతకు కల. సాంకేతిక ప్రపంచంలో స్టార్టప్ లు పెట్టుకోవడం ఎలాగో.. తయారీ రంగంలో సూక్ష్మ, చిన్నతరహా  పరిశ్రమలు అలా పెట్టుకుని సొంత కాళ్లపై నిలబడి.. మరో పది మందికి ఉపాధి కల్పించాలని  పట్టుదలతో శ్రమించేవారు ఉంటారు. ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీని ప్రకటించింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే!
అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో నూతన మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆపరేషన్ బుడమేరు అంశం పై కూడా కేబినెట్ చర్చించింది. ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. దీని కోసం కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
మన దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభమైంది. అక్టోబర్‌ నెలలో దసరా, దీపావళి పర్వదినాలు ఉన్నాయి. పిండివంటలు లేకుండా పండుగ పూర్తి కాదు. అయితే, మూడు రోజుల క్రితం, వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే, కొన్ని కంపెనీల నూనెల రేట్లు పెరిగాయి. లీటరు నూనె రేటు రూ.15 నుంచి రూ.20 వరకు ప్రియమైంది. గత శనివారం పొద్దున, లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.115గా ఉంటే, సాయంత్రానికల్లా అది రూ.130+కు చేరింది. మరికొన్ని కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Zomato CEO Deepinder Goyal :  అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
Nagarjuna : వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
Embed widget