అన్వేషించండి

YS Sharmila: రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యల రచ్చ! విజయవాడలో వైఎస్ షర్మిల నిరసన

AP News: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్ర మంత్రి రణ్‌వీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఏపీలో వైఎస్ షర్మిల దీనిపై నిరసన చేపట్టారు.

YS Sharmila Protest: రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత అని, అలాంటి వ్యక్తిని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తుంటే ఆ పార్టీ అధిష్ఠానం అస్సలు స్పందించడం లేదని ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ నేతలు ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోదీ, షా లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతుందని షర్మిల అన్నారు. ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. వారి ద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల భారీ నిరసన చేశారు. ఆ నిరసనలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు? ఏది తీవ్రవాదం? ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు. వాళ్లకు అభివృద్ధి లో వాటా లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా? అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలి. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను, మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. అన్ని మతాలకు, కులాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నీచంగా బీజేపీ మాట్లాడుతుంది. రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు. 

రాహుల్ అమ్మమ్మ, నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలి అయ్యారు. ఈ విషయం బీజేపీకి తెలియదా? రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు. రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీకి లేదు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ. మత చిచ్చు పార్టీ. బీజేపీ తీవ్రవాదుల పార్టీ. మతాల మధ్య చిచ్చుపెట్టాలి.. అందులో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ సిద్ధాంతం. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం బీజేపీ తీవ్రవాది పార్టీ అనడానికి నిదర్శనం కాదా? కేవలం అగ్ర వర్ణాలకు కొమ్ము కాయడం తీవ్రవాదం అనిపించుకోదా? అణగారిన వర్గాలను తొక్కాలని బీజేపీ చూస్తుంది. ఈ దేశంలో రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతుంది. రాహుల్ పాదయాత్రతో ఈ దేశంలో ధైర్యం నింపాడు.

బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ. బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించింది. ఈ దేశంలో బీజేపీ కి మించిన వేర్పాటు వాదుల పార్టీ ఇంకోటి ఉందా? మసీదుల మీద, చర్చ్ ల మీద, క్రిస్టియన్లు, ముస్లీం ల మీద ఊచ కోత కోసిన టెర్రరిస్టు పార్టీ ఈ బీజేపీ కాదా? ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని చెప్పడం టెర్రరిజం అనరా? ఈ దేశంలో అగ్రవర్ణాల కొమ్ము గాస్తున్నది బీజేపీ కాదా? కేవలం 10 శాతం మంది మీ తొత్తుల చేతుల్లోనే భారతీయ వ్యాపారం మొత్తం కేంద్రీకృతం కాలేదా? కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఎంత మంది దళిత, గిరిజనులు ఉన్నారు? వెనుక బడిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ 40 శాతానికి ఎందుకు తగ్గించారు? ఓబీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఎందుకు 15 శాతానికి తగ్గించారు? 

దళిత మహిళకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర పథకాల నిధులను 20 శాతానికి ఎందుకు కోత పెట్టారు? 10 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు 15 నుంచి 32 శాతానికి ఎలా పెరిగాయి? వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. బీజేపీని హెచ్చరిస్తున్నం.. మర్యాదగా రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget