Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే!
AP Cabinet: నూతన మద్యం పాలసీకి ఆమోదం, వంద రోజుల్లో సాధించిన విషయాలపై చర్చ సహా కీలక అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన సమావేశం ఇంకా కొనసాగుతోంది.
Andhra Pradesh Cabinet Meeting: అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో నూతన మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆపరేషన్ బుడమేరు అంశం పై కూడా కేబినెట్ చర్చించింది. ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. దీని కోసం కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు వరదలు వచ్చినప్పుడు కేంద్రం చేసిన సాయానికి మంత్రి మండలి కృతజ్ఞత తెలిపింది. వరద నష్టంపై కూడా అదే స్థాయిలో ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల నివేదికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చాయి.
ఇవి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి సమాలోచనలు జరుపుతోంది. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరు ఇలా అన్నింటిపై కూలంకుశంగా మాట్లాడుకున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అందజేశారు.
Also Read: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!