Tirumala Darshan Tickets: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
Tirumala News: డిసెంబర్‌లో తిరుమల వెళ్లే వాళ్ల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. టికెట్ల విడుదల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కచ్చిందా మీకు వెళ్లే ఆలోచన ఉంటే మాత్రం ఈ డేట్స్ గుర్తు పెట్టుకోండి.
Tirumala Darshan Tickets For December: డిసెంబర్‌లో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనునే వాళ్లకు అదిరిపోయే వార్త. శ్రీనివాసుడు దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. ఆర్జిత సేవ టికెట్ల కోసం సెప్టెంబర్ 20 ఉదయం పది గంటల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆర్జిత సేవ టికెట్లు ప్రక్రియ పూర్తైన తర్వాత సెప్టెంబర్ 21 నుంచి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్స్ సవా టికెట్లు రిలీజ్ చేస్తుంది.
ఈ టికెట్ల ప్రక్రియ రెండు రోజుల్లో ముగుస్తుంది. దీంతో 23న అంగ ప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత శ్రీవాణీ ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అదే రోజు మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగుల కోటా ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు.
ఈ దర్శన టికెట్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తర్వాత రోజు అంటే 24వ తేదీన ఉదయం పది గంటలకు డిసెంబర్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం వెళ్లాలనుకునే వాళ్ల కోసం టికెట్లు రిలీజ్ చేస్తారు. వీటితోపాటు మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ను ఓపెన్ చేస్తారు.
27వ తేదీన శ్రీవారి సేవా కోటా, నవనీత సేవ, పరకామణి సేవా కోటా టికెట్లు కూడా విడుదల చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెల్లి దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.