News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: నేటి టాప్ 10 న్యూస్: బీజేపీకి దగ్గరవ్వడానికి చంద్రబాబు ప్రయత్నాలు - ఆ వ్యాఖ్యల అర్థం అవేనా?

తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కన్నుమూత

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కన్నుమూశారు. శిరోమణి అకాలీదళ్‌ అధినేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మంగళవారం రాత్రి 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రకాష్ సింగ్ బాదల్.. ఆదివారం మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐసీయూలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి పంజాబ్ మాజీ సీఎం బాదల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్‌ వెల్లడించారు. బుధవారం బాదల్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇంకా చదవండి

సునీత భర్త ఫోన్ చేస్తేనే వెళ్లా, సునీతక్క మాట మార్చింది - ఎంపీ అవినాష్ రెడ్డి

కడప జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించారు.  ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సునీతమ్మ స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. మొదట సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ లో మా ప్రస్తావనే లేదన్నారు. మొదట లెటర్ దాచిన విషయంలో కూడా మా కుటుంబానికి సంబంధం లేదు అన్నారు. సీబీఐ దర్యాప్తు కుట్ర కోణంలో ఉందన్నారు. తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంకా చదవండి

జగన్ కు ఓటేస్తే కట్టుబట్టలు కూడా మిగలవు - చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు.. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో  పాల్గొన్నారు. పెదకూరపాడు బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్టంలో జగన్ విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని కొనసాగిస్తే... ఏపీలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని ఆరోపించారు. అమరావతి పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుందన్నారు. జగన్ బ్యాచ్ ఎవ్వరిని వదలనని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలలో  కన్నా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. యర్రగొండపాలెంలో ఓ మంత్రి నాపై రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ఎస్సీలకు న్యాయం చేసిన ఏకైక  పార్టీ  టీడీపీ అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జస్టిన్ పున్నయ్య కమిషన్ నియమించామన్నారు. ఎస్సీ వర్గాలు సమానంగా అభివృద్ధి‌ చెందాలని వర్గీకరణ తెచ్చామన్నారు. గూగుల్ లో‌ 693 కొడితే జగన్ వ్యవహారం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా‌ సంఘాలు నా మానస‌ పుత్రిక అన్న చంద్రబాబు... మహిళలకు వడ్డీ‌ లేని రుణాలు ఇచ్చానన్నారు. ఇంకా చదవండి

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా ?
 
ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే విబేధించాం.. ఇక అన్ని విషయాల్లోనూ మోదీ విధానాలను సమర్థిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా ప్రకటించారు. అంతే కాదు ఎన్డీఏలో చేరిక విషయంలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంటే... ఖచ్చితంగా ఆయన ఖండించలేదు. చాన్స్ ఉందన్నట్లుగా చెప్పారు. తన వైపు నుంచి ఆయన సంకేతాలు పంపినట్లుగానే భావించవచ్చని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు కీలకం కావొచ్చు. ఎందుకంటే.. ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా చివరికి బీజేపీకే మద్దతుగా నిలుస్తుంది. కానీ టీడీపీతో ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే నేరుగా అలయెన్స్ కలుపుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీతో అలాంటి అవకాశం ఉండదు. ఇంకా చదవండి
 
పోలీసులపై దాడి చేయలేదన్న షర్మిల
 
పోలీసులపై దాడి చేయలేదని పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి తనపై కేసులు పెట్టారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.  బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు.  కే సి ఆర్ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడని మండిపడ్డారు.  టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో సిట్ కార్యాలయానికి వెళ్లి  రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నానన్నారు.  కావాలనే పోలీస్ లను పెట్టీ నన్ను అరెస్ట్ చేశారన్నారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన వారిలో ఇద్దరు మాత్రమ మహిళా పోలీసులు ఉన్నారని.. తనను ఓ మహిళ అని చూడకుండా మీదపడి దాడి చేశారన్నారు. ఇంకా చదవండి
 
పులివెందుల ఇంటికి అవినాష్ రెడ్డి- శివారులో సీబీఐ అధికారులు మకాం
 
కడప జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత ముందస్తు బెయిల్ పై తుదితీర్పు వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను బుధవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పరిణామాల మధ్య కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. అయితే సీబీఐ అధికారులు ఇప్పటికే పులివెందులకు చేరుకుని ఊరి శివార్లలో ఎదురుచూస్తున్నారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి కోసం అనుచరులు పెద్ద ఎత్తున పులివెందులకు తరలివచ్చారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. ఇంకా చదవండి
 
ఒకరు మెదడు లేని బంటి, ఇంకొకరు పార్టీలు మారే చంటి: మంత్రి కేటీఆర్ సెటైర్లు
 
ముఖ్యమంత్రి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో లేరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని, వస్తున్నాయని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి పల్లె ప్రగతి కార్యక్రమంతోనే సాధ్యం అయిందని తెలిపారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా చదవండి  
 
రెండేళ్ల జైలు శిక్షపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
 
సూరత్‌ కోర్టు విధించిన విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. తనకు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. సెషన్స్ కోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వులపై రాహుల్ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు కాంగ్రెస్ పార్టీ లాయర్ బీఎం మంగూకియా వెల్లడించారు. ఇంకా చదవండి
 
ముంబయి.. మళ్లీ ఫెయిల్‌! 55 తేడాతో జీటీ చేతిలో అవమానం!
 
ప్చ్‌.. ముంబయి! కథేమీ మారలేదు! అదృష్టం కలిసి రాలేదు! ఒకే తరహా వైఫల్యం వారిని పదేపదే వెంటాడుతోంది. వరుస ఓటములకు దారితీస్తోంది. గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లోనూ ఇంతే! ఏకంగా 55 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 208 టార్గెట్‌ ఛేజ్‌లో 20 ఓవర్లకు 152/9కి పరిమితమైంది. నేహాల్‌ వధేరా (40; 21 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కామెరాన్‌ గ్రీన్‌  (33; 26 బంతుల్లో 3x0, 3x6) ఫర్వాలేదనిపించాడు. అంతకు ముందు టైటాన్స్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (56; 34 బంతుల్లో 7x4, 1x6) కెరీర్లో 17వ హాఫ్‌ సెంచరీ బాదేశాడు. అభినవ్‌ మనోహర్‌ (42; 21 బంతుల్లో 3x4, 3x6), డేవిడ్‌ మిల్లర్‌ (46; 22 బంతుల్లో 3x4, 3x6) చితక్కొట్టారు. ఇంకా చదవండి
 
సంయుక్తాకు ‘గోల్డెన్ లెగ్’ క్రెడిట్ - స్టార్ హీరోయిన్ రేసులో మలయాళీ బ్యూటీ?
రోజుకో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందం అభినయం, టాలెంట్ తెలుగు పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. దీనికి సక్సెస్ కూడా యాడ్ అయితే కొన్నాళ్ళు రాణించగలుగుతారు. అదే బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడితే, గోల్డెన్ లెగ్ గా ముద్రవేసి వరుస అవకాశాలు అందిస్తుంటారు. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ సంయుక్త మీనన్ విషయంలో జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
 
సంయుక్త మీనన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'పాప్ కార్న్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ కేరళ కుట్టి.. తమిళ మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఐశ్వర్య రాజేష్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన సంయుక్త.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఇంకా చదవండి
 
Published at : 26 Apr 2023 07:50 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today

సంబంధిత కథనాలు

Manufacturing: తయారీ రంగంలో భారత్‌ భళా, డ్రాగన్‌ కంట్రీ డీలా

Manufacturing: తయారీ రంగంలో భారత్‌ భళా, డ్రాగన్‌ కంట్రీ డీలా

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!