IPL 2023, GT vs MI: ముంబయి.. మళ్లీ ఫెయిల్! 55 తేడాతో జీటీ చేతిలో అవమానం!
IPL 2023, GT vs MI: ప్చ్.. ముంబయి! కథేమీ మారలేదు! అదృష్టం కలిసి రాలేదు! ఒకే తరహా వైఫల్యం వారిని పదేపదే వెంటాడుతోంది. వరుస ఓటములకు దారితీస్తోంది.
IPL 2023, GT vs MI:
ప్చ్.. ముంబయి! కథేమీ మారలేదు! అదృష్టం కలిసి రాలేదు! ఒకే తరహా వైఫల్యం వారిని పదేపదే వెంటాడుతోంది. వరుస ఓటములకు దారితీస్తోంది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లోనూ ఇంతే! ఏకంగా 55 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 208 టార్గెట్ ఛేజ్‌లో 20 ఓవర్లకు 152/9కి పరిమితమైంది. నేహాల్ వధేరా (40; 21 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కామెరాన్ గ్రీన్ (33; 26 బంతుల్లో 3x0, 3x6) ఫర్వాలేదనిపించాడు. అంతకు ముందు టైటాన్స్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (56; 34 బంతుల్లో 7x4, 1x6) కెరీర్లో 17వ హాఫ్ సెంచరీ బాదేశాడు. అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3x4, 3x6), డేవిడ్ మిల్లర్ (46; 22 బంతుల్లో 3x4, 3x6) చితక్కొట్టారు.
Inching closer to victory, the @gujarat_titans!#MI 8 down now.
— IndianPremierLeague (@IPL) April 25, 2023
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/gmhZ2lTDUI
పవర్ ప్లే నుంచే ప్రెజర్!
ఒకప్పుడు 200+ టార్గెట్లను ఈజీగా ఛేదించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడేమో ఆ స్కోర్లను చూస్తేనే భయపడుతోంది. ఒత్తిడికి గురవుతోంది. పవర్ ప్లేలో గుజరాత్ పేసర్లు కట్టుదిట్టమైన బంతుల్ని విసిరారు. బ్యాటర్లు ఆడేందుకు అస్సలు ఛాన్సే ఇవ్వలేదు. దాంతో 4 పరుగుల వద్దే రోహిత్ శర్మ (2) హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక మహ్మద్ షమీ అస్సలు రన్స్ ఇవ్వలేదు. దాంతో 6 ఓవర్లకు ముంబయి 29/1తో నిలిచింది. ఆ తర్వాత కథేమీ మారలేదు. రషీద్ ఖాన్ వేసిన 8వ ఓవర్లో ఇషాన్ కిషన్ (13; 21 బంతుల్లో), తిలక్ వర్మ (2) వెంటవెంటనే ఔటయ్యారు. ఇక జట్టు స్కోరు 59 వద్ద గ్రీన్, టిమ్ డేవిడ్‌ను బంతి వ్యవధిలోనే నూర్ అహ్మద్ పెవిలియన్‌కు పంపించాడు. ఈ సిచ్యువేషన్లో సూర్యకుమార్ (23; 12 బంతుల్లో), వధేరా కలిసి 14 బంతుల్లో 31 రన్స్ చేశారు. అయితే 90 వద్ద సూర్యను అహ్మద్ ఔట్ చేశాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా (18)తో కలిసి వధేరా 24 బంతుల్లో 45 రన్స్ పాట్నర్‌షిప్ నెలకొల్పాడు. వధేరా అక్కర్లేని పరుగు వల్ల చావ్లా రనౌట్ అయ్యాడు. రివర్స్ స్కూప్ ఆడబోయి అతడూ పెవిలియన్ చేరడంతో... ముంబయి ఓటమి ఖరారైంది. 152/9కి పరిమితమైంది. అర్జున్ తెందూల్కర్ (13) ఒక సిక్స్ కొట్టి అలరించాడు.
శుభ్ 'ఆరంభం'
మూడో ఓవర్లోనే వికెట్ పడ్డా గుజరాత్ టైటాన్స్ పవర్‌ప్లేలో మంచి స్కోరే చేసింది. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్‌ను క్యాపిటలైజ్ చేసుకొని 50/1తో నిలిచింది. జట్టు స్కోరు 12 వద్దే వృద్ధిమాన్ సాహా (4)ను జూనియర్ తెందూల్కర్ పెవిలియన్‌కు పంపించినా.. గిల్ నిలబడ్డాడు. హార్దిక్ పాండ్య (13)తో కలిసి రెండో వికెట్‌కు 24 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తన బ్యాటింగ్‌లోని సొగసును ప్రదర్శించాడు. అమేజింగ్ కవర్‌డ్రైవ్‌లు.. లాఫ్టెడ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 6.1వ బంతికి పాండ్యను పియూష్ చావ్లా ఔట్ చేయడంతో విజయ్ శంకర్ (19; 16 బంతుల్లో) కలిసి మూడో వికెట్‌కు 30 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
కిల్లర్.. మనోహర్!
శుభ్‌మన్ గిల్ జస్ట్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. జట్టు స్కోరు 91వద్ద అతడిని కుమార్ కార్తికేయ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. 12.1 ఓవర్లకు గుజరాత్ స్కోరు 100 పరుగుల మైలురాయి అందుకుంది. మధ్యలో జీటీ రన్‌రేట్ కాస్త తగ్గినట్టు అనిపించినా.. ఆఖర్లో అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ కలిసి ముంబయి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. సిక్సర్లు.. బౌండరీలతో దుమ్మురేపారు. 35 బంతుల్లోనే 71 రన్స్ పాట్నర్‌షిప్‌తో పాండ్య సేనను పటిష్ఠ స్థితికి తీసుకెళ్లారు. మెరిడీత్ వేసిన 18.1వ బంతికి మనోహర్ ఔటయ్యాక.. కిల్లర్ మిల్లర్ తన పని మొదలెట్టాడు. అదే ఓవర్లో మూడు సిక్సులు బాదేశాడు. తర్వాతి ఓవర్లో రాహుల్ తెవాతియా (20*; 5 బంతుల్లో 3x6) ఓ రెండు సిక్సులు కొట్టడంతో జీటీ 207/6తో నిలిచింది.