News
News
వీడియోలు ఆటలు
X

Modi Surname Case: రెండేళ్ల జైలు శిక్షపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ, ఊరట లభిస్తుందా!

సూరత్‌ కోర్టు విధించిన విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

FOLLOW US: 
Share:

సూరత్‌ కోర్టు విధించిన విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. తనకు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. సెషన్స్ కోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వులపై రాహుల్ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు కాంగ్రెస్ పార్టీ లాయర్ బీఎం మంగూకియా వెల్లడించారు. 

బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హతా వేటు పడిన తరవాత ఆ బంగ్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తల్లి సోనియా గాంధీ ఇంటికి మకాం మార్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. నిజం మాట్లాడినందుకే తాను ఇలా మూల్యం చెల్లించుకుంటున్నానని అన్నారు. దాదాపు 19 ఏళ్లుగా ఆ బంగ్లాలో ఉంటున్నానని, ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పారు. 

చట్ట ప్రకారమే..
ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం...ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా...లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలూ ఉన్నాయి. అయితే...ఈ తీర్పుపై న్యాయ పోరాటం కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఒకవేళ పైకోర్టులో ఊరట లభిస్తే రాహుల్ అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ సూరత్ కోర్టు తీర్పుని ఏ హైకోర్టు కూడా కొట్టివేయలేదంటే మరో 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోతారు రాహుల్. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో భయపడేదే లేదు అని తేల్చి చెబుతోంది.

ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...రాహుల్‌కు శిక్ష విధించింది.  అయితే వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఈ పిటిషన్ వేశారు. రాహుల్ ప్రధాని మోదీని దారుణంగా అవమానించారని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ఆ వర్గాన్ని కించపరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌పై ఐపీసీ సెక్షన్స్ 499,500 ప్రకారం పరువు నష్టం కేసు నమోదైంది. 2021 అక్టోబర్‌లో రాహుల్ సూరత్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. పూర్తి విచారణ తరవాత ఆయనను దోషింగా తేల్చింది సూరత్ కోర్టు. 

Published at : 25 Apr 2023 09:29 PM (IST) Tags: Defamation case Gujarat High Court Rahul Gandhi Rahul Gandhi Defamation Case Rahul Gandhi Disqualification

సంబంధిత కథనాలు

రాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే, హనుమంతుడు కూడా ఆదివాసీయే - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే, హనుమంతుడు కూడా ఆదివాసీయే - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD

Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD

Wrestlers Protest: సమస్యలు తీరితేనే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం, మానసికంగా కుంగిపోయాం - సాక్షి మాలిక్

Wrestlers Protest: సమస్యలు తీరితేనే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం, మానసికంగా కుంగిపోయాం - సాక్షి మాలిక్

కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?

కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?

International Yoga Day: యోగా రాజకీయాలు షురూ, బీజేపీకి పోటీగా ఆప్ వేడుకలు

International Yoga Day: యోగా రాజకీయాలు షురూ, బీజేపీకి పోటీగా ఆప్ వేడుకలు

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు