Minister KTR: ఒకరు మెదడు లేని బంటి, ఇంకొకరు పార్టీలు మారే చంటి: మంత్రి కేటీఆర్ సెటైర్లు
Minister KTR: మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపడే వారు లేరని అన్నారు.
Minister KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో లేరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని, వస్తున్నాయని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి పల్లె ప్రగతి కార్యక్రమంతోనే సాధ్యం అయిందని తెలిపారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘తెలంగాణ, హైదరాబాద్ల అభివృద్ధి అన్స్టాపబుల్. దీనిని మోదీ, షా ఎవరూ ఆపలేరు. ప్రగతి రథచక్రం ఆగదు. ఎవరైనా అడ్డువస్తే జగన్నాథ రథచక్రాల్లా తొక్కుకుంటూ ముందుకు పోవడమే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS స్పష్టం చేశారు. pic.twitter.com/yrm94DCBpW
— BRS Party (@BRSparty) April 25, 2023
60 లక్షల మంది గులాబీ దండుకు పేరుపేరునా ధన్యవాదాలు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్ఎస్ గా పార్టీ ఆవిర్భవించిందని కేటీఆర్ గుర్తు చేశారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ రూపాంతరం చెందిందని తెలిపారు. మారింది కేవలం టీఆర్ఎస్ పేరు మాత్రమే అని.. జెండా, గుర్తు, డీఎన్ఏ మారలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ ఆనాడు నమ్మి, అర్థబలం, అంగబలం లేకపోయినా తెలంగాణ కోసం బయలుదేరారని తెలిపారు. అంతకుముందు ఉన్న నేతలు తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదని చెప్పుకొచ్చారు.
ఉద్యమం నుండి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. 2013 లో ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తున్నా.. తెలంగాణలోనే అడుగు పెడతానని కేసీఆర్ చెప్పారని, అన్నట్లుగానే తెలంగాణ సాధించి తిరిగి వచ్చారని కొనియాడారు. లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ జన్మ దన్యమైందని ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో మన కళ్ల ముందు కనబడుతోందని, దేశం గుర్తిస్తోందని అన్నారు.
- మోదీకి ఘర్వాపసీ తప్పదు
— BRS Party (@BRSparty) April 25, 2023
- 2024లో ప్రధాని పదవి ఖాళీకాక తప్పదు
- ఏటీఎం అంటే అదానీ టు మోదీ డబ్బు ప్రవాహమే
- అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే
- బీజేపీకి ఈసారి 103 చోట్ల డిపాజిట్లు రావు
‘సాక్షి’ ఇంటర్వ్యూ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS. pic.twitter.com/CN4KQ0ZilN
తెలంగాణలోని ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని కేటీఆర్ తెలిపారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి పల్లె ప్రగతితోనే సాధ్యం అయిందని చెప్పుకొచ్చారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా గంభీరావుపేట గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ ను వేదికపైకి పిలిచి ఆయనను అభినందించారు. ఇది గోల్ మాల్ గుజరాత్ కాదని.. గోల్డెన్ తెలంగాణ అని కేటీఆర్ అభివర్ణించారు.
- ప్రధాని-అదానీ అవిభక్త అవినీతి కవలలు!
— BRS Party (@BRSparty) April 25, 2023
- బీజేపీది సోషల్ మీడియాలో లొల్లెక్కువ.. సొసైటీలో ఇజ్జత్ తక్కువ
ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS గారి ప్రత్యేక ఇంటర్వ్యూ..https://t.co/tOaquu3LtM pic.twitter.com/dtrCd53XAF
దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలకు లక్షల్లో జనాలు వచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో గత తొమ్మిది ఏళ్లల్లో వ్యవసాయానికి రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రైతులకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన ప్రభుత్వం ఏదీ లేదని స్పష్టం చేశారు.