అన్వేషించండి

Sharmila: పోలీసులపై దాడి చేయలేదన్న షర్మిల - జైలు నుంచి విడుదల !

Sharmila Released From Jail:  జైలు నుంచి విడుదయ్యారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. తాను పోలీసులపై దాడి చేయలేదన్నారు.

Sharmila Released From Jail:  పోలీసులపై దాడి చేయలేదని పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి తనపై కేసులు పెట్టారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.  బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు.  కే సి ఆర్ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడని మండిపడ్డారు.  టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంలో సిట్ కార్యాలయానికి వెళ్లి  రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నానన్నారు.  కావాలనే పోలీస్ లను పెట్టీ నన్ను అరెస్ట్ చేశారన్నారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన వారిలో ఇద్దరు మాత్రమ మహిళా పోలీసులు ఉన్నారని.. తనను ఓ మహిళ అని చూడకుండా మీదపడి దాడి చేశారన్నారు. 

ఇంటికి ఉద్యోగం హామీ ఏమైంది కే సి ఆర్  అని సీఎంను షర్మిల ప్రశ్నించారు.  ఉద్యోగాల లేవు .. డబుల్ బెడ్ రూం ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. తాను ఎవరి మీద చేయి చేసుకోలేదని స్పష్టం చేశారు.  పోలీసులు కావాలనే కొన్ని సెలెక్ట్ వీడియోలు బయటపెట్టారని..తన శరీరం తాకే వీడియోలు పోలిసులు నాపై కన్నెర్ర చేసిన వీడియోలు ఎక్కడ కూడా బయట పెట్టలేదన్నారు. పోలీసులు కే.సి అర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని.. పోలీసుల్ని కుక్కల్లా కేసీఆర్ వాడుకుంటున్నారని మండిపడ్డారు.  వైఎస్ విజయలక్ష్మి..  రాజశేఖర్ రెడ్డి బార్య అని పోలీసులకు  కనీస జ్ఞానం లేదన్నారు. అనుచితంగా ప్రవర్తించిన మహిళా పోలీస్‌పై విజయమ్మ ఓ దెబ్బ వేశారని.. దానిక  విజయమ్మ బాంబులు వేసినట్లు చిత్రీకరించారని విమర్శించారు. 

సహనం నశించి తాను  పోలీసులను తోశానని దాడి చేయలేదన్నారు. తనను  హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ఆర్డర్ కాపీ  లేదన్నారు.  కాలికి గాయం అయిన పోలీస్ కానిస్టేబుల్ మా తరపు వకిల్ సమక్షంలో వేరే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఉదయం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మధ్యాహ్నం సమయంలో పూచీకత్తులు సమర్పించి జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు  ఆదేశాల మేరకు రూ.30 వేల పూచీకత్తుతో కూడిన రెండు షూరిటీలను షర్మిల కోర్టుకు సమర్పించారు.              

కోర్టు పెట్టిన షరతులు ఇవీ  

రూ. 30వేల పూచీకత్తు ఇద్దరు వ్యక్తులతో ఇప్పించాలని కోర్టు షరతు పెట్టింది. అలాగే విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. షర్మిల నిన్నే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదోపవాదాల తర్వాత కోర్టు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా పోలీసులపై దాడి చేశారు. అయితే పోలీసులు ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఆమెపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని..  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి.                                

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
 Pallavi Model Schools TOEFL YSS: భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
 భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
Indiramma Housing Scheme: హైదరాబాద్‌లో ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. 4 చోట్ల టవర్లు నిర్మించనున్న ప్రభుత్వం
హైదరాబాద్‌లో ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. 4 చోట్ల టవర్లు నిర్మించనున్న ప్రభుత్వం
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget