Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్
హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఇంకా చదవండి
బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు వచ్చింది. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా చదవండి
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి అనుకోవద్దని, ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాలేదని.. కౌంటింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీల శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఎలాంటి అరాచకానికి పాల్పడుతారో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లో చూశామన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 82 శాతం ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయం అని, కానీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదన్నారు. ఇంకా చదవండి
పెట్రో బాంబులకు అలా చెక్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర హింస పెరిగిపోవడంతో కట్టడి కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెట్రో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలను నిషేధించారు. అలా అమ్మితే పెట్రోల్ బంకుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల పల్నాడులో జరిగిన గొడవల్లో పెట్రో బాంబులతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున పెట్రో బాంబులు దొరికాయి. దీంతో బాటిళ్లలో పెట్రోలు అమ్మకాల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చదవండి
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్!
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. వారికి ఎలక్షన్ కమిషన్ (Election Commission) షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఎన్నికల తాయిళాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాల విలువ రూ.8,889 కోట్ల ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా చదవండి
ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే
ప్రతి ఇంట్లో ఉండే గోలే ఇది. అవును మరి. ఉప్మా అంటే ఆ రేంజ్‌లో వచ్చేస్తుంది విరక్తి. ఆ పేరు చెబితేనే పెదవి విరిచేస్తారు చాలా మంది. వండడం సింపులే అయినా తినడమే కష్టం. ఇంతకీ ఉప్మాపై ఎందుకింత కోపం..? అసలు ఈ టిఫిన్ ఎందుకు నచ్చదు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి రోజుల్లో తేలతాం. అంతే కాదు. ఉప్మా కేవలం అల్పాహారం మాత్రమే కాదు. దాని చుట్టూ ఎన్నో రాజకీయాలున్నాయి. మరెన్నో ఆర్థిక కోణాలూ ఉన్నాయి. చెప్పాలంటే అందులో మన బానిసత్వం కనిపిస్తుంది. కాస్తంత అతిశయోక్తి అనిపించినా అసలు కథ తెలిస్తే అదంతా నిజమే అని అర్థమవుతుంది. ఇంకా చదవండి
ప్రభాస్ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు రోజులుగా బుజ్జీ అంటూ అందరిలో ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తుంది. ఇంతకీ ఎవరా బుజ్జి అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బుజ్జిని పరిచయం చేస్తామంటూ 'కల్కి 2898 AD' టీం ప్రకటన ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల బుజ్జీని పరిచయం లేటు అయ్యిందంటూ కొన్ని గంటలు క్రితం ఓ పోస్ట్ కూడా చేసింది. ఇక ఫైనల్ ప్రభాస్ బుజ్జీ గురించి మూవీ టీం తాజాగా ఓ ఆసక్తికర వీడియో వదిలింది. ఇందులో మూవీ క్రూ అంతా బుజ్జి గురించే మాటాడుతూ మరింత ఆసక్తి పెంచారు. ఇంకా చదవండి
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా?
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్ అనే సరిహద్దులను కూడా లెక్కచేయకుండ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 14 ఏళ్ల తమ వైవాహిక జీవితాన్ని స్వస్తీ చెబుతూ విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడిపోయిన సానియా మిర్జా ప్రస్తుతం సింగిల్ పేరెంట్‌గా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంకా చదవండి
ఐటీ రిటర్న్ ఫైలింగ్‌కు ఫామ్-16 మాత్రమే చాలదు - ఈ రెండు డాక్యుమెంట్లు ఉండాల్సిందే!
ప్రస్తుతం, 2023-24 ఆర్థిక సంవత్సరం (FY 2024-25) లేదా 2024-25 మదింపు సంవత్సరానికి (AY 2024-25) ఆదాయ పన్ను రిటర్న్‌ల ఫైలింగ్ సీజన్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఫామ్-16 తీసుకున్నారు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇవ్వడం ప్రారంభించాయి. ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు చివరి తేదీ 31 జులై 2024. ఒకవేళ ఈ గడువులోగా రిటర్న్ దాఖలు చేయలేకపోతే, ఆగస్టు 01 నుంచి ఆలస్య రుసుముతో కలిపి రిటర్న్ దాఖలు చేసే వెసులుబాటు ఉంది. ఇంకా చదవండి
రెండో స్థానంపై హైదరాబాద్ కన్ను, పంజాబ్ అడ్డుకోగలదా?
మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)... పాయింట్ల పట్టికలో రెండో స్థానంపై కన్నేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్.. నామమాత్రపు మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS)తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. ఇంకా చదవండి